ప్రస్తుతం తెలుగుతో పాటూ హిందీ, తమిళ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ పాన్ ఇండియా హీరోయిన్ గా దూసుకుపోతోంది పూజా హెగ్డే.ఎక్కడ ఇండ్రస్టీ కి తగ్గట్టు అక్కడ సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తోంది ఈ బుట్టబొమ్మ.కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా ప్రాధాన్యత ఉన్న పాత్రలను కూడా చేస్తోంది.ఈ క్రమంలోనే 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమాలోనూ ఒక ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించింది  పొడుగుకాళ్ళ సుందరి. అయితే ముందుగా పూజా హెగ్డే ఈ పాత్రను చేయగలుగుతుందా అని దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ అనుకున్నాడట.అతని మొదటి సినిమా బొమ్మరిల్లు సినిమాలో హాసిని పాత్ర ఎంత ప్రత్యేకమో అందరికీ తెలిసిందే.

ఇక ఆ తర్వాత వచ్చిన 'ఆరెంజ్' సినిమాలోనూ అంతే.ఇక ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమాలోనూ పూజా హెగ్డే పాత్ర అలాగే ఉంటుందట.అయితే ఈ పాత్ర స్టార్ డమ్ ఉన్న హీరోయిన్ కి నప్పుతుందో లేదో అని అనుకున్నారట బొమ్మరిల్లు భాస్కర్.అదే మాట నిర్మాత బన్నీ వాసుకి కూడా చెప్పాడట.కానీ పూజా హెగ్డే యాక్టింగ్ చూశాక..అదిరిపోయిందని అనుకున్నారట.ఇక సినిమాలో పూజా హెగ్డే స్టాండప్ కమెడియన్ రోల్ లో కనిపిస్తుంది.ముందు హీరోయిన్ గా ఆమెను సెలెక్ట్ చేసుకున్నప్పుడు..ఇలాంటి ఒక ఎనర్జిటిక్ రోల్ లో పూజా హెగ్డే ఎలా నటిస్తుందో అని అనుకున్నాడట ఈ సినిమా దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్.

ఈ విషయాన్ని బన్నీ వాసు దగ్గర చెప్తూ..'స్టాండప్ కమెడియన్ చాలా కష్టమైన పాత్ర.ఒకవేళ పూజా సరిగ్గా చేయలేకపోతే ఎలా అని అన్నారట భాస్కర్.అయితే ఆ తర్వాత సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యాక.. పూజా హెగ్డే డెడికేషన్ చూసి ఫిదా అయ్యాడట బొమ్మరిల్లు భాస్కర్.మరి అంతలా పూజా హెగ్డే ఈ సినిమాలో ఎలాంటి నటనను కనబర్చిందో చూడాలి.ఇక దసరా కానుకగా అక్టోబర్ 15 న్ విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలై మంచి రెస్పాన్స్ ని అందుకుంది.ఇక అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాస్ నిర్మిస్తున్న ఈ సినిమాకి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: