సౌత్ ఇండియాలో స్టార్ హీరో యిన్ గా గ‌త ద‌శాబ్దం కాలంకు పై గా ఓ వెలు గు వెలుగు తోంది చెన్నై చిన్న‌ది స‌మంత‌. గౌత‌మ్ మీన‌న్ ద‌ర్శ‌క‌త్వంలో 2010లో వ‌చ్చిన ఏమాయ చేశావే సినిమాతో ఆమె మీరోయిన్ గా తొలిసారి వెండి తెర‌కు ప‌రిచ‌యం అయ్యింది. ఆ సినిమా లో చైతు - సామ్ జంట చూసిన ప్రేక్ష‌కులు వారి రొమాన్స్ చూసి మై మ‌ర‌చిపోయారు. చైతు కూడా సామ్ తో అదిరిపోయే రొమాన్స్ పండించాడు. త‌ర్వాత ఎవరి దారులు వారివి అయ్యాయి. మ‌ధ్య‌లో వీరు మూడు సినిమాల్లో జంట‌గా న‌టించారు. త‌ర్వాత స‌మంత కూడా ఒక‌రిద్ద‌రు తో ప్రేమాయ‌ణం న‌డిపిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. అందులో ఓ యంగ్ హీరోతో ఆమె స‌హ‌జీవ‌నం కూడా చేసింద‌న్న ప్ర‌చార‌మూ జ‌రిగింది. అయితే చైతు విష‌యం లో మాత్రం ఎలాంటి రూమ‌ర్స్ రాలేదు.

చివ‌ర‌కు వీరు 2017 అక్టోబ‌ర్ 7న గోవాలో పెళ్లి చేసుకున్నారు. ఆ త‌ర్వాత కూడా వీరి కాంబోలో మ‌జిలీ సినిమా వ‌చ్చి హిట్ అయ్యింది. ఇక స‌మంత చేసిన ఓ బేబీ సినిమాలోనూ చైతు గెస్ట్ రోల్ చేశాడు. క‌ట్ చేస్తే నెల రోజుల వార్త‌ల ను నిజం చేస్తూ వీరు అధికారికంగా విడిపోయాడు. ఇక స‌మంత‌కు స్టార్ హీరోయిన్ స్టేట‌స్ త్వ‌ర‌గా రాలేదు. ఆమె కు అందంతో పాటు అభిన‌యం కూడా ఉంది. అందుకే ప‌దేళ్లుగా సౌత్ సినిమా ఇండ‌స్ట్రీని ఆమె ఏలేసింద‌నే చెప్పాలి. ఇటు తెలు గుతో పాటు అటు త‌మిళ్ లోనూ అంద‌రు స్టార్ హీరోల‌తో న‌టించి ఆమె హిట్లు కొట్టింది.

ఆమెకు వ‌రుస విజ‌యాల‌తో పాటు సొంతంగా నిర్ణ‌యాలు తీసుకోవ‌డం.. తాను గొప్ప అన్న అహం కూడా పెరిగింద‌నే అంటారు. ఏదేమైనా ఆమెను కంట్రోల్ చేయ‌డంతోనే ఆమె త‌ట్టుకోలేక విడాకులు ఇచ్చేసింద‌నే అంటున్నారు. ఇక లేటెస్ట్ వార్త ఏంటంటే ఆమె తిరిగి సినిమాల్లో న‌టించేందుకు రెడీ అయిపోయింద‌ట‌. తన‌కు ఇంత క్రేజ్ రావ‌డాని కి కార‌ణ‌మైన సినిమాల‌ను తాను వ‌దిలే ప్ర‌శ‌క్తే లేద‌ని చెప్పేసింద‌ట‌. ఇప్ప‌టికే ఆమె న‌టించిన సినిమాలు రిలీజ్ కు రెడీ గా ఉన్నాయి. ఆమె త్వ‌ర‌లోనే మ‌రికొన్ని సినిమాల్లో న‌టించేందుకు సిద్ధంగా ఉంద‌ని తెలుస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: