కోలీవుడ్ లో శింబు ఒకప్పుడు తన హవా సృష్టించాడు. పెద్ద పెద్ద హిట్ లు సాధించి స్టార్ హీరోల సరసన నిలిచాడు. ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. ఎప్పుడూ ఇలానే ఉంటుందనుకున్నాడో ఏమో... కెరియర్ పై కాస్త నిర్లక్ష్యం వహించాడనే విమర్శలు తలెత్తుతున్నాయి. సరిగా డైట్ మెయింటైన్ చేయకపోవడం.. వ్యాయామానికి దూరంగా ఉండటం లాంటివి చేశాడు. దీంతో ఎవరూ గుర్తుపట్టలేని విధంగా తయారయ్యాడు. బాడీ షేప్ అవుట్ అయిపోయింది. ఫ్యాన్స్ అంతా నిరుత్సాహానికి గురయ్యేలా చేశాడు. విపరీతంగా లావు ఉండటంతో... ఒక్కొక్కటిగా అవకాశాలు దూరమయ్యాయి. దీంతో తీవ్ర ఆవేదనకు గురయ్యాడు శింబు.

బ్యాక్‌గ్రౌండ్‌ ఉంటే సినిమా జీవితాన్ని సులువుగా మొదలు పెట్టవచ్చు. అదే బ్యాక్‌గ్రౌండ్‌ని సరిగా వాడుకోలేకపోతే కెరియర్  కష్టాల్లో పడుతుంది. కానీ మిస్‌ యూజ్‌ చేసుకుంటే మాత్రం కోలుకోలేని దెబ్బతింటారు. ఇప్పుడు శింబు పరిస్థితి కూడా ఇలాగే ఉంది. జనాలని థియేటర్లకి రప్పించడానికి కూడా కష్టపడుతున్నాడు శింబు.

శింబు వివాదాల్లో పడినంత ఈజీగా విజయాలు అందుకోలేకపోతున్నాడు. ఎన్నాళ్ల నుంచి ప్రయత్నం చేసినా సరైన సక్సెస్ మాత్రం రావడం లేదు. బరువు తగ్గించుకొని మరీ ప్రేక్షకుల ముందుకెళ్లినా మెప్పించలేకపోతున్నాడు. దీంతో ఈ హీరో మార్కెట్‌ మొత్తానికే పడిపోయింది. రెండు మూడు హిట్స్‌ పడితే గానీ, కోలుకోలేని పరిస్థితుల్లోకి వెళ్లిపోయాడు.

శింబు ఆల్కాహాల్‌కి అడిక్ట్‌ అయ్యాక కటౌట్‌పై పెద్దగా కేర్ తీసుకోలేదు. దీంతో బాగా వెయిట్‌ పెరిగాడు. ఆ ఓవర్‌ వెయిట్‌తో సినిమాలు చేస్తే జనాలు మేం చూడలేమని ఫ్లాపులిచ్చి మరీ చెప్పేశారు. దీంతో కెరీర్‌ కాపాడుకోవడానికి మందు మానేసి జిమ్‌కి అంకితమయ్యాడు. లాక్‌డౌన్స్‌లోనూ రెస్ట్‌ లేకుండా వర్కవుట్లు చేసి సన్నబడ్డాడు.

శింబు బరువుతగ్గాక 'ఈశ్వరన్' అనే సినిమా చేశాడు. అయితే మూవీ కూడా ఫ్లాపుల్లో కలిసిపోయింది. గ్రాఫ్ మరింత డౌన్‌ అయ్యింది. ఇక కంపల్సరీగా హిట్‌ కొట్టాలి అనే పరిస్థితుల్లో 'మానాడు' సినిమాతో జనాల ముందుకొస్తున్నాడు. తెలుగు, తమిళ్, మళయాళంలో ఈ సినిమాని విడుదల చేస్తున్నారు మేకర్స్.  



మరింత సమాచారం తెలుసుకోండి: