ఈ సంవత్సరం మా ఎన్నికలు ఎంత రసవత్తరంగా జరుగుతున్నాయో మన అందరికీ తెలిసిందే, మొదట మా అధ్యక్ష పదవికి ఎంతోమంది పోటీదారుల పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ, చివరిగా మాత్రం ప్రకాష్ రాజ్, మంచు విష్ణు బరిలో ఉన్నారు. వీరిద్దరు తమ తమ మద్దతు దారులతో టీవీ ఛానల్ ఇంటర్వ్యూ లలో , సోషల్ మీడియా ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ ఫుల్ హల్చల్ చేశారు. మరియు ఈ ఇంటర్వ్యూ లలో భాగంగా ఒకరిపై ఒకరు వ్యక్తిగత దూషణలు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇంతలా ఓటర్ల దృష్టిని ఆకర్షించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఇది ఇలా ఉంటే ఈరోజు ఉదయం మా పోలింగ్ ప్రక్రియ ప్రారంభం అయ్యింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో అగ్ర హీరోలు అయిన మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, నాగార్జున తమ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

 మధ్యాహ్నం రెండు గంటల వరకే ఓటింగ్ ప్రక్రియ జరగవలసి ఉండగా, కొంత మంది రావాల్సి ఉండడం, మరి కొంత మంది ట్రాఫిక్ లో ఇరుక్కుపోవడం వల్ల ఒక గంట పాటు ఎలక్షన్ సమయాన్ని పొడిగించారు. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ల తో మాట్లాడిన మా పోలింగ్ అధికారి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ సమయాన్ని పెంచారు. ఈసారి రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదు అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే మా ఎలక్షన్ల పై పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు చేసింది. మా ఎలక్షన్ లో ఓటు హక్కును వినియోగించుకున్న పూనమ్ కౌర్ ఆ తర్వాత మీడియాతో మాట్లాడింది. పూనమ్ కౌర్ మీడియాతో మాట్లాడుతూ.. టాలీవుడ్ లో చాలా రాజకీయాలు జరుగుతున్నాయి అని తెలియజేసింది. రాజకీయ ప్రయోజనం కోసం ఆర్టిస్టులను సతాయించడం మానుకోవాలని పూనమ్ కౌర్ తెలియజేసింది. ఏ ప్యానెల్ గెలిచినప్పటికీ రాజకీయాలను, మా అసోసియేషన్ ను కలపకూడదు అని కోరుకుంటున్నట్లుగా పూనమ్ కౌర్ తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: