బిగ్ బాస్ రియాల్టీ షో ఇండియా వ్యాప్తంగా ఎంత పాపులారిటీని సంపాదించుకుందో మన అందరికీ తెలిసిన విషయమే, తెలుగులో ఇప్పటికే నాలుగు సీజన్ లను పూర్తి చేసుకొని ప్రస్తుతం ఐదవ సీజన్ కంటిన్యూ అవుతున్న  ఈ రియాల్టీ షో తెలుగుతో పాటు తమిళ్ లో కూడా మంచి ప్రేక్షకాదరణ పొందుతూ ముందుకు దూసుకుపోతుంది. ఇలా ఎంతో మంది బుల్లితెర అభిమానుల మనసులు దోచుకున్న బిగ్ బాస్ రియాల్టీ షో  గురించి ప్రముఖ నటి కస్తూరి శంకర్ ఆసక్తికరమైన కామెంట్ చేసింది. ఈ నటి గృహలక్ష్మి సీరియల్ ద్వారా ఎంతో మంది తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయ్యింది. సీరియల్స్ ద్వారా ఫేమస్ అయిన కస్తూరి అప్పుడప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ కూడా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. అలాంటి ఈ నటి బిగ్ బాస్ రియాల్టీ షో గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది. ఈ క్రమంలో గృహలక్ష్మీ ఫేమ్ కస్తూరి ఇప్పటి వరకు బిగ్ బాస్ షో ఒక ఎపిసోడ్ కూడా తాను చూడలేదు అని, తన లాంటి వారు ఎవరైనా ఉన్నరా ? అంటూ తన సోషల్ మీడియా అకౌంట్ లో కస్తూరి పోస్ట్ చేసింది. కస్తూరి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పోస్ట్ కు రకరకాల రియాక్షన్స్ వచ్చాయి.

  అందులో ఓ నెటిజన్ బిగ్ ‏బాస్ ‏లో మీరు నాకు నచ్చలేదు అంటూ కామెంట్ చేశాడు. దీని పై స్పందించిన కస్తూరి తన స్టైల్ లో రియాక్ట్ అయ్యింది. షో లో నిజాలు మాత్రమే చూపించాల్సిన అవసరం లేదు. ఈ షో గురించి ప్రేక్షకులకు కనిపించింది మాట్లాడతారు. కానీ అందులో పాల్గొని బయటకు వచ్చిన కంటెస్టెంట్స్ మాటలు మరోలా ఉంటాయి అని కస్తూరి తెలిపింది. ఒక రోజులో జరిగిన సంఘటనలు కేవలం గంట ఎపిసోడ్ గా తమ నచ్చిన విధంగా ఎడిట్ చేసి ప్లే చేస్తారు, మంచిని చెడుగా, చెడుని మంచిగా చూపించే ఆస్కారం కూడా ఉంది, రోజులో చిన్న గొడవ జరిగిన దాన్నే హైలేట్ చేసి చూపిస్తుంటారు..  నిజంగానే బిగ్‏బాస్‏ ఓ మాయలాంటింది, షో చూసి ఎవ్వరిని జడ్చ్ చేయకండి అంటూ చెప్పుకొచ్చింది కస్తూరీ శంకర్. అలాగే అక్కడ తామంతా ఒకే కుక్కర్లో అడ్డుకుంటామని కొంచెం ఫుడ్ మాత్రమే వస్తుందని కస్తూరి తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: