మెగాస్టార్ చిరంజీవి మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మొదట్లో మెహర్ రమేష్ తో సిని మా అనగానే ప్రతి ఒక్కరు ఎంతో ఆశ్చర్యపడ్డారు. మెగాస్టార్ చిరంజీవి ఒక ఫ్లాప్ డైరెక్టర్ తో సినిమా ఏమిటి అని అనుకున్నారు కానీ మెహర్ రమేష్ పై నమ్మకం తోనే చిరంజీవి ఆయనకు ఈ సినిమా అవకాశాన్ని ఇచ్చాడు. మొదటి నుంచి మెహర్ రమేష్ పై చిరంజీవి మంచి నమ్మకాన్ని ఏర్పరచుకుంటునే వస్తున్నాడు.

అయితే మెగాస్టార్ చిరంజీవి మెహర్ రమేష్ ను నమ్మినట్లు గా ఆయన అభిమానులు మాత్రం నమ్మలేకపోతున్నారు. దానికి కారణం ఆయన గత చిత్రాలే అని చెప్పవచ్చు.  మెహర్ రమేష్ తీసిన గత చిత్రాలు భారీ ఫ్లాపులు గా నిలిచాయి. అంతే కాదు ఆ సినిమాలు కనీస వసూళ్లు కూడా సాధించలేక నిర్మాతలకు భారీ నష్టాలన్ని చేకూర్చాయి. ఆయన కంత్రి,శక్తి, బిల్లా, షాడో అనే 4 సినిమాలను చేయగా వాటిలో బిల్లా మాత్రమే పర్వాలేదనిపించింది. మిగతా మూడు సినిమాలు కూడా భారీ ఫ్లాప్ లు గా నిలిచాయి. 

ఈ ఎఫెక్ట్ ఆయనపై కొన్ని సంవత్సరాలు ఉంది. ఆయనతో సినిమాలు చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. చిన్న హీరో లు సైతం ఆయన తో సిని మా అంటే భయపడి పోయారు. కానీ మెగాస్టార్ చిరంజీవి కథ మీద నమ్మకంతో మెహర్ రమేష్ డైరెక్షన్ మీద నమ్మకంతో ఈ సినిమాకి గానూ ఆయనకు ఛాన్స్ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో అభిమానులకు నమ్మకం కలిగించేలా మెహర్ రమేష్ ఏదైనా చేస్తే బాగుంటుందని సినిమా విశ్లేషకుల ఆలోచన. ఈ నేపథ్యంలో ఈ సినిమా నవంబర్ 11వ తేదీన సినిమా లాంచ్ రోజున ఏదైనా టీజర్ లాంటిది విడుదల చేసి తనను తాను నిరూపించుకుని పాత ముద్ర తొలగించుకుటే బాగుంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: