యువ నటుడు మంచు విష్ణు హీరోగా హన్సిక మోత్వానీ హీరోయిన్ గా జి నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్, ఎమోషనల్ హిలేరియస్ ఎంటర్టైనర్ మూవీ దేనికైనా రెడీ. కమెడియన్ బ్రహ్మానందం, తమిళ నటుడు ప్రభు, సీనియర్ యాక్టర్ సుమన్, సీత, ఆలీ, ఎల్ బి శ్రీరామ్ వంటి నటులు కీలక పాత్ర లు చేసిన ఈ సినిమా కొన్నేళ్ల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది.

అంతకముందు శ్రీను వైట్ల తీసిన ఢీ సినిమాతో కెరీర్ పరంగా పెద్ద హిట్ కొట్టిన విష్ణు, ఈ దేనికైనా రెడీ రూపంలో మరొక ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ సినిమాలో బ్రహ్మానందం, ఏవీఎస్, ఎం ఎస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, భరత్, అనంత్ వంటి వారి కామెడీ సీన్స్ కి థియేటర్స్ లో ఆడియన్స్ అప్పట్లో పొట్ట చెక్కలయ్యేలా నవ్వారనే చెప్పాలి. ఆ విధంగా ఆడియన్స్ ని ఎంతోఆ ఆకట్టుకునేలా కామెడీ తో పాటు మంచి స్క్రీన్ ప్లే, ఎంటర్టైన్మెంట్ తో కూడిన యాక్షన్ తో ఈ సినిమాని దర్శకుడు నాగేశ్వర రెడ్డి ఎంతో అద్భుతంగా తీశారు.

అయితే ఈ సినిమా సక్సెస్ కొట్టినప్పటికీ దీనిపై అప్పట్లో పలు బ్రాహ్మణ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేసాయి. దేనికైనా రెడీ మూవీ లో తమ సామజిక వర్గాన్ని కించపరిచేలా ఉన్న కొన్ని డైలాగ్స్ తో పాటు సన్నివేశాలు కూడా తొలగించాలి అంటూ బ్రాహ్మణ సంఘాలు ఆందోళన చేపట్టడంతో పాటు ఒకింత నిరసన కూడా వ్యక్తం చేసాయి. కాగా ఆ విధంగా కొన్ని సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ కూడా దేనికైనా రెడీ మూవీ ఓవరాల్ గా విష్ణు కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ గా నిలిచి ఆయన కెరీర్ కి మంచి బాటలు వేసిందని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: