ప్రస్తుతం మన తెలుగు లో ఉన్న యాంకర్లలో అనసూయ డిమాండ్ కాస్త ఎక్కువగా ఉంది అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. అనసూయ విషయంలో చాలా మంది ఈ సినిమా నిర్మాతలు కూడా ఆసక్తి చూపించే ఆమెను తమ తమ సినిమాలో కీలకపాత్రకు తీసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ప్రస్తుతం అనసూయ టీవీ షోల మీద ఎక్కువగా దృష్టి సారించి సినిమాల మీద ఎక్కువగా దృష్టి పెట్టింది అనే వ్యాఖ్యలు కూడా టాలీవుడ్ వర్గాల్లో ఎక్కువగా వినబడుతున్నాయి. ఇక ఇతర భాషల్లో కూడా ఆమె టీవీ షోలు చేసే అవకాశముందని మలయాళంలో ఒక టీవీ షో చేయడానికి సిద్దం అవుతుందని ఈ మధ్యకాలంలో ప్రచారం జరిగింది.

అయితే కొన్ని సమస్యల కారణంగా అనసూయ కొన్ని రోజులు విరామం తీసుకునే అవకాశం ఉందని పిల్లల విషయంలో ఆమె కాస్త ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నారని పిల్లల విషయంలో కొన్ని జాగ్రత్తలు కారణంగానే యాంకరింగ్ కి కొన్ని రోజులు దూరంగా ఉండే అవకాశం ఉందని దాదాపుగా ఆరు నెలల పాటు ఆమె దూరంగా ఉండే అవకాశాలు ఉండవచ్చని అంటున్నారు. ప్రస్తుతం అనసూయ సినిమాల్లో పెద్దగా నటించకపోయినా సరే అగ్ర హీరోల సినిమాల్లో మాత్రం ఆమెకు మంచి ఆఫర్లు వస్తున్నాయి.

దీనికి సంబంధించి త్వరలోనే అనసూయ నుంచి ఒక కీలక ప్రకటన కూడా వచ్చే అవకాశాలు ఉండవచ్చు అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. ప్రస్తుతం తెలుగు బుల్లితెర మీద అనసూయ కు ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే పిల్లల విషయంలో ఆమె కాస్త ఇంట్లో ఇబ్బంది పడుతున్నారని పిల్లల మీద దృష్టి పెట్టకపోవడంతో చదువు విషయంలో కూడా కాస్త ఇబ్బంది పడుతున్నారని అందుకనే అనసూయ గ్యాప్ తీసుకుని అవకాశాలున్నాయని అంటున్నారు. ఇక వచ్చే ఏడాది అనసూయ వరుసగా సినిమాల్లో నటించే అవకాశాలు కూడా ఉండవచ్చని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: