నటసింహ నందమూరి బాలకృష్ణ కెరీర్లో నటించిన పలు చారిత్రాత్మక చిత్రాల్లో 'గౌతమీపుత్ర శాతకర్ణి' సినిమా కూడా ఒకటి. ఈ సినిమాని క్రిష్ జాగర్లమూడి డైరెక్ట్ చేశారు. బాలయ్య కెరీర్ లో 100వ సినిమాగా గౌతమీపుత్ర శాతకర్ణి రూపొందింది. ఈ సినిమాతో బాలకృష్ణ భారీ విజయాన్ని అందుకున్నారు. ముందుగా తన 100వ సినిమాని కృష్ణవంశీ దర్శకత్వంలో చేయాలని అనుకున్నాడు బాలకృష్ణ. కానీ ఆ తర్వాత దర్శకుడు క్రిష్ బాలయ్యకు ఈ కథ వినిపించగా.. ఆ కథ బాలయ్యకు విపరీతంగా నచ్చేసింది. దీంతో కచ్చితంగా తన 100వ సినిమా క్రిష్ తో నే చేయాలని బాలవయ్య ఫిక్స్ అయ్యాడు. దీంతో గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా సెట్స్ పైకి వెళ్ళింది.

బాలయ్య కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాని దర్శకుడు క్రిష్ కేవలం 80 రోజుల్లోనే షూటింగ్ మొత్తం పూర్తి చేశాడు. దీంతో ఈ విషయం తెలుసుకున్న ఇండస్ట్రీలో పలు దర్శకులు ఒక్కసారిగా షాకయ్యారు. ఎందుకంటే ఒక చారిత్రాత్మక నేపథ్యం కలిగిన ఈ సినిమాని తెరకెక్కించాలి అంటే భారీ సెట్స్, విజువల్స్, గ్రాఫిక్స్ ఇలా చాలా అంశాలు ఉంటాయి. అందుకు చాలా సమయం పడుతుంది. కానీ క్రిష్ మాత్రం కేవలం 80 రోజుల్లో మాత్రమే ఈ సినిమాని  ఎంతో గ్రాండియర్ గా తెరకెక్కించాడు. ఇక 2017 జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇక దర్శకుడు క్రిష్ ఈ సినిమా కి ఎంచుకున్న నేపథ్యం, శాతకర్ణి పాత్రలో బాలయ్య నటన, ఆయన చెప్పిన డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

ఇక ఈ సినిమాలోని శాతకర్ని పాత్రకు డైలాగ్ రైటర్ సాయి మాధవ్ బుర్ర రాసిన డైలాగ్స్ అయితే చాలా అద్భుతంగా ఉంటాయి. ఇక వాటిని బాలయ్య పలికించిన తీరు సినిమాకి మేజర్ హైలెట్ అని చెప్పాలి. దీంతో బాలయ్య గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా డైరెక్టర్ క్రిష్ మరియు బాలయ్య కెరీర్లో ఎంతో ప్రత్యేకంగా నిలిచింది. ఇక మొదటి నుంచి పౌరాణిక చారిత్రక పాత్రల్లో సిద్ధహస్తుడైన బాలకృష్ణ శాతకర్ణి పాత్రలోని రాజసాన్ని, గంభీరత్వాన్ని ప్రదర్శించడంలో నూటికి నోరు పళ్ళు విజయం సాధించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. అంతేకాదు ఈ సినిమా టేకింగ్ నచ్చి దర్శకుడు క్రిష్ కి బాలకృష్ణ మరోసారి అవకాశం కూడా ఇచ్చాడు. గౌతమీపుత్ర శాతకర్ణి తరువాత క్రిష్ బాలయ్యతో ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాలు తెరకెక్కించాడు. అయితే ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేక పోయాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: