డబ్బులు ఎవ్వరికి ఊరికే రావు.. ఇది నిజం. ప్రస్తుతం ఉన్న గజిబిజి లైఫ్ లో ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదించాలని కోరుకోవడం కామన్. ఇందుకోసం ఎంతో కొంత కష్టపడి కూడా పనిచేస్తారు. కానీ కొందరికి అదృష్టం కలిసి వచ్చి భారీగా సంపాదిస్తారు. మరికొందరు ఉన్నదాంతోనే సర్ధుకుపోతారు. ఈ విషయంలో సామాన్యులకు సెలబ్రిటీలకు చాలా తేడా ఉంటుంది. మనం నెల రోజులు ఖర్చు చేసే డబ్బును వాళ్ళు ఒక్క గంటల్లో ఖర్చుపెట్టేస్తారు. అలా ఉంటుంది వాళ్ల లైఫ్ స్టైల్. సెలబ్రిటీల లైఫ్ స్టైల్ వేరు గా ఉంటుందన్న విషయం తెలిసిందే. కానీ కొన్ని సార్లు వాళ్ళు చేసే ఖర్చు చూస్తే తిట్టాలో .. నవ్వాలో కూడా అర్ధంకాదు.

స్టార్ హీరోయి ప్రియాంక చోప్రా మనకు బాగా తెలిసిన పేరే. బుల్లితెరపై ఎన్నో పవర్ ఫుల్ ఇంకా హిట్ చిత్రాల్లో నటించి.. ఏకంగా గ్లోబల్ స్టార్ గా అవతరించిన హాట్ బ్యూటి.  అమ్మడుకు ఉన్నంత క్రేజ్ బహుశా ఏ ఒక్క స్టార్ హీరోకి కూడా లేదనే చెప్పాలి అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఈమెకు. బాలీవుడ్ సినిమాల ద్వారా తన సినీ కెరీర్ ని ప్రారంభించిన ప్రియాంక చోప్రా ఆ తర్వాత మెల్లగా హాలీవుడ్ రేంజ్ కు ఎదిగిపోయింది. ఇక అక్కడ కూడా భిన్న విభిన్నమైన పాత్రలు సెలక్ట్ చేసుకుంటూ..సినిమాల్లో నటిస్తూ ఎంతో మంది ప్రేక్షకులను తన అభిమానులుగా మార్చుకుంది ఈ ముద్దుగుమ్మ.

ప్రియాంక చోప్రా తనకంటే వయసుల్లో చిన్నవాడైన అమెరికాకు చెందినటువంటి ప్రముఖ సింగర్ , నటుడు అయిన  నిక్ జోనస్ ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.  మే 2018 లో అంగరంగ వైభవంగా వీళ్లు వివాహం చేసుకున్నారు. తాజాగా ప్రియాంక ఓ ఇంటర్వ్యూల్లో  మాట్లాడుతూ.. తన ఎంగేజ్మెంట్ రింగ్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంది. ఆమెకు ఇష్టమైన వాటిలో తన ఎంగేజ్మెంట్ రింగ్ కూడా ఒకటి అని చెప్పుకొచ్చిన ఈ బ్యూటీ..ఎంగేజ్మెంట్ రింగ్ ధర రూ.2 కోట్లకు పైమాటే అని చెప్పి అందరికి షాకిచ్చింది. ఇక ఈ రింగ్ ధరతో సామాన్యులు ఏకంగా 100 పెళ్లిళ్లు చేసుకోవచ్చు అనే చెప్పాలి. తన ఎంగేజ్మెంట్ రింగ్ ఎప్పుడూ తన చేతి నుండి విడిపోదని.. తనకు ఆ రింగ్ తో ఎన్నో స్వీట్ మెమోరీస్ ఉన్నాయని చెప్పుకొచ్చింది.ఇక ఆమె ఆస్తుల గురించి మాట్లాడితే మీడియా కథనాల ప్రకారం దేశీ గర్ల్ ప్రియాంక చోప్రా ఆస్తి సుమారు రూ .374 కోట్లు పై మాటే ..!!

మరింత సమాచారం తెలుసుకోండి: