
'లైగర్' నిర్మాణంలో కరణ్ జోహార్ పార్ట్‌నర్ అనే అనౌన్స్‌మెంట్ వచ్చినప్పుడు హిందీలో పెద్దగా బజ్ వచ్చిందో లేదో గానీ, మైక్ టైసన్ నటిస్తున్నాడు అనే ఒకే ఒక్క అనౌన్స్‌మెంట్‌తో ఇండియన్ మూవీ మార్కెట్‌లో చిన్న వైబ్రేషన్ స్టార్ట్ అయ్యింది. 'లైగర్'పై అంచనాలు పెరిగాయి. ఇక ఈ మూవీ కోసం బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్‌కి భారీగా చెల్లిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
అనుష్క తెలుగులో కనిపించిన లాస్ట్ మూవీ 'నిశ్శబ్ధం'. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో మల్టీలింగ్వల్‌గా రూపొందిన ఈమూవీలో హాలీవుడ్ స్టార్ మైఖెల్ మాడ్‌సెన్ కీ-రోల్ ప్లే చేశాడు. అయితే ఫస్ట్ వేవ్ టైమ్‌లో డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజైన ఈ సినిమాకి నెగటివ్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా బిజినెస్ ఎప్పుడూ అంచనాల చుట్టూనే తిరుగుతుంది. ఆడియన్స్‌లో భారీ బజ్ ఉన్న సినిమాలు భారీ బిజినెస్ చేస్తాయి. పెద్దగా అంచనాల్లేని సినిమాలకి ఓపెనింగ్స్ కూడా సరిగా ఉండవు. ఈ బిజినెస్ కోసమే ఇంటర్నేషనల్‌స్టార్స్‌ని తీసుకొస్తున్నారు ఫిల్మ్ మేకర్స్. ఈ మార్కెటింగ్‌లో బాలీవుడ్ జనాలు అందరికంటే ముందున్నారు.
హాలీవుడ్ స్టార్‌లా కనిపించే హృతిక్ రోషన్ బాలీవుడ్‌కి ఫారెన్ హీరోయిన్‌ని కూడా పరిచయం చేశాడు. కైట్స్ సినిమాలో మెక్సికన్ నటి బార్బారా మోరీతో రొమాన్స్ చేశాడు హృతిక్. ఇక ఈ సినిమా టైమ్‌లో ఇద్దరు డేటింగ్‌లో ఉన్నారని ప్రచారం జరిగింది. కానీ ఈ సినిమా తర్వాత మళ్లీ ఇద్దరు కలిసి కనిపించలేదు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్న సిల్వస్టర్ స్టాలోన్ హిందీ సినిమాలోనూ మెరిశాడు. అక్షయ్ కుమార్ 'కంబక్త్ ఇష్క్' సినిమాలో క్యామియో అప్పియరెన్స్ ఇచ్చాడు సిల్వస్టర్ స్టాలోన్. ఇక సూపర్ పెర్ఫామెన్స్‌తో మెప్పించే హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్ కూడా హిందీ సినిమాలో మెరిశాడు. 'స్టూడెండ్ ఆఫ్ ది ఇయర్2'లో ఒక సాంగ్‌లో మెరిశాడు.