టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ చిన్న కూతురు శివాత్మిక ఇప్పటికే సినిమాలలో  నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. తాజాగా రాజశేఖర్ పెద్ద కూతురు శివాని రాజశేఖర్ కూడా అద్భుతం సినిమాతో జనాలను పలకరించడానికి రెడీగా ఉంది. ఈ సినిమా  ప్రముఖ ఓటిటి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈనెల 19 వ తేదీ నుండి స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా టైమ్‌ ట్రావెలర్‌ లాంటి ఒక విభిన్న కథాంశంతో తెరకెక్కింది. ఇది ఇలా ఉంటే రాజశేఖర్ పెద్ద కూతురు శివాని ఇప్పటికే సినిమాలలో ఎంట్రీ ఇవ్వాల్సింది. కాక పోతే అడవి శేష్‌ తో ‘టూ స్టేట్స్‌’, తమిళంలో విష్ణు విశాల్‌ తో ఓ సినిమా.. ఇలా రెండు సినిమాలు మధ్య లోనే ఆగిపోయాయి. ఇలా శివాని రెండు సినిమాలు మధ్య లో ఆగిపోయినప్పటికీ ఎట్టకేలకు ఇప్పుడు అద్భుతం సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి రెడీగా ఉంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదల తేది దగ్గర పడటంతో ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఈ చిత్ర బృందం పలు టీవీ ఛానల్ ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ హల్ చల్ చేస్తున్నారు. అందులో భాగంగా ఆదివారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో శివాని తన కెరీర్‌ కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది...

శివాని మాట్లాడుతూ... స్టార్‌ కిడ్స్‌ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇండస్ట్రీ లో సులభంగా రాణిస్తుంటారని చాలా మంది అనుకుంటారు. అందరికి ఏమో కానీ నా విషయంలో అలా జరగలేదు. కెరీర్ ప్రారంభం లోనే అవాంతరాలు ఎదురైతే ఇండస్ట్రీలో బ్యాడ్‌లక్‌, ఐరన్‌లెగ్‌ అనే ముద్రలు వేస్తుంటారు. ఏ సినిమా మొదలు పెట్టినా మధ్య లోనే ఆగిపోవడంతో నాకు నేనే ఐరెన్‌లెగ్‌గా భావించుకున్నా. డిప్రెషన్ లోకి కూడా వెళ్ళిపోయా. కానీ అమ్మానాన్నల ప్రోత్సాహం, ధైర్యం వల్లే కష్టాల్ని సవాల్‌గా స్వీకరించి ధైర్యంగా నిలబడ్డాను అని శివాని రాజశేఖర్ తెలిపింది. అలానే శివాని రాజశేఖర్ సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి రావడం వల్ల ప్లస్‌ తో పాటు మైనస్‌ లు కూడా ఉన్నాయని చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: