సినీ ఇండస్ట్రీలో కొంత మందికి కొన్ని సెంటిమెంట్లు కచ్చితంగా ఉంటాయి. అయితే అందులో హీరో హీరోయిన్లకు, డైరెక్టర్లకు మాత్రమే ఉంటాయని చెప్పుకోవచ్చు. కానీ అన్ని భాషల సైతం సినిమా ఇండస్ట్రీకే ఒక సెంటిమెంట్ ఉన్నది. అది ఏమిటంటే కేవలం ఒక చెట్టు మాత్రమే. ఆ చెట్టు ఎక్కడ ఉన్నది. వాటి వివరణ ఎంటో ఇప్పుడు చూద్దాం.

ఆంధ్రప్రదేశ్లోని గోదావరి ప్రాంతంలో సినిమాలు తీస్తే కచ్చితంగా సక్సెస్ అవుతాయని నమ్మకం కొంతమంది డైరెక్టర్లకు ఉంది. అందులో అక్కడి ప్రకృతి అందాలు కూడా ప్రేక్షకులు బాగా ఆస్వాదిస్తూ ఉంటారు. అయితే గత కొద్ది సంవత్సరాల నుంచి మాత్రం షూటింగులు ఎక్కువగా  అవుట్ డోర్ లోజరగడంతో విదేశాల వైపు మాత్రమే మొగ్గుచూపుతున్నారు మన సినీ ఇండస్ట్రీలో ఉండేవారు. దాంతో గోదావరి తీరా ప్రాంతాల నడుమ సినిమా షూటింగులు సైతం తగ్గిపోయాయని చెప్పుకోవచ్చు.

కానీ రంగస్థలం,పుష్ప వంటి సినిమాలు గోదావరి తీర ప్రాంతంలో షూటింగ్ చేయడంతో ఈ ప్రాంతానికి తిరిగి కల వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక ఈ గోదావరి ప్రాంతంలోనే ఎందరో డైరెక్టర్లు సైతం కొన్ని లొకేషన్లలో సినిమా తీస్తే ఖచ్చితంగా హిట్టవుతుందనే నమ్మకం ఉండేదట.. అందులో ముఖ్యంగా  దాసరి నారాయణరావు, డైరెక్టర్ బాపు, కృష్ణవంశీ మరికొంత మంది నటులు కూడా ఇదే  సెంటిమెంట్ గా భావించే వారట.

మొదటిసారిగా 1964లో మూగమనసులు సినిమాలోని ఒక పాటని ఇక్కడ చిత్రీకరించడంతో అప్పటి నుంచి ఇది సెంటిమెంట్ గా మారుతోంది. అది కూడా కేవలం గోదావరి ప్రాంతంలో కొవ్వూరు మండలం లో ఉండేటువంటి ఒక నది ఒడ్డున"నిద్రగన్నేరు" అనే చెట్టు ఉన్నది. అక్కడ షూటింగ్ చేసుకున్న ఎడల ఆ సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని భావించే వారట. ఈ చెట్టు కింద ఏకంగా 300 లకు పైగా చిత్రాల్లో తెరకెక్కించడం గమనార్హం. ఇక ఇక్కడే షూటింగ్ చేసి మన స్టార్ హీరోలు సైతం సక్సెస్ అందుకున్న సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: