చిత్ర పరిశ్రమలో కొంత మంది హీరోలు ఇక సినిమాలో ప్రయోగాలు చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఈ క్రమంలోనే ఎప్పుడూ విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు. అయితే సినిమాల్లో హీరోలు చేసే విభిన్నమైన పాత్రలు ప్రేక్షకులను కేవలం రెండు గంటల పాటు మాత్రమే అలరిస్తూ ఉంటాయి. కానీ ఆ పాత్రలో నటించడానికి మాత్రం కొన్ని నెలలపాటు హీరోలు కష్టపడాల్సి ఉంటుంది అని చెప్పాలి. పాత్రకు తగ్గట్లుగా బరువు పెరగడం బరువు తగ్గడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు హీరోలు.


 కొన్ని కొన్ని సార్లు కాస్త రిస్క్ అని తెలిసినప్పటికీ కూడా సినిమా పాత్ర కోసం లైఫ్ రిస్క్ చేయడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. ఇప్పటివరకు ఎంతో మంది హీరోలు పాత్రల కోసం భారీగా బరువు తగ్గడం లాంటివి చూశాం. ఇక్కడ ఈ హీరో ఇలాంటి రిస్క్ చేసి అందరిని ఆశ్చర్య పరుస్తున్నాడు.. ఎందుకంటే ఇక్కడ ఒక హీరో  ఏకంగా ఒక సినిమా కోసం 27 కేజీల బరువు తగ్గాడు. ప్రస్తుతం తమిళ హీరో శింబు కి తెలుగులో కూడా ఎంతో క్రేజ్ వుంది. ప్రస్తుతం తమిళంలో స్టార్ హీరో గా కొనసాగుతున్న శింబు  తెలుగులో మన్మధ వల్లభా లాంటి సినిమాలతో ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్నాడు.



 కాగా ఈ హీరో ప్రస్తుతం లూప్ అనే సినిమాలో నటించాడు. ఇక ఈ సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.  అయితే ఈ సినిమా కోసం తాను మూడేళ్ల నుంచీ కష్టపడ్డాను అంటూ చెప్పుకొచ్చారు హీరో శింబు. మానసిక ఒత్తిడి కారణంగా తాను ఎంతగానో బరువు పెరిగి పోయాను అంటూ చెప్పుకొచ్చాడు.. అయితే ఈ సినిమాలో నటించడానికి గానూ బరువు తగ్గి తనను తాను మార్చుకోవాలి అని నిర్ణయించుకున్నాను అంటూ తెలిపాడు. ఇలా మద్యానికి మాంసానికి పూర్తిగా దూరంగా ఉండి ఏకంగా ఇరవై ఏడు కేజీల బరువు తగ్గాను హీరో శింబు చెప్పి ప్రస్తుతం అందరినీ ఆశ్చర్యపరిచాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: