ఆదివారం వచ్చిందంటే మనసుకు కొత్త రెక్కలోస్తాయి. ఎందుకంటే వారమంతా ఉద్యోగం, వ్యాపారము అంటూ ఫుల్ బిజీబిజీగా గడిపేస్తుంటారు, పొద్దున లేచింది మొదలు రాత్రి వరకు వృత్తి రీత్యా ఎంతో బిజీగా ఉంటాం. అందుకే సండే అంటే చాలు కొత్త ఆనందం వచ్చి వాలుతుంది. మనసుకు కాస్త ప్రశాంతత కోసం, మంచి ఎంటర్టైన్మెంట్ కోసం ముందు ఏదైనా మంచి సినిమా ఉందా అని సెర్చ్ చేస్తుంటారు చాలామంది. అయితే ఈ వారం మంచి సినిమాతో ఫుల్ గా ఎంజాయ్ చేయాలి అనుకునే వారికి ఇదిగో మీకోసమే ఎక్కువ క్రెడిట్ పొందిన చిత్రాలను మీ ముందు ఉంచుతున్నాము వాటిలో మీకు నచ్చనివి సెలెక్ట్ చేసుకొని మీ ఫ్యామిలీతో సహా థియేటర్స్ వెళ్లి ఆనందంగా చూసేయండి మరి.

* ఫుల్ మాస్ అండ్ యాక్షన్ ఫిల్మ్ కావాలి అనుకునే ప్రేక్షకులు ముందుగా 'అఖండ' సినిమాను చూడాల్సిందే. ఎందుకంటే బోయపాటి, బాలయ్య కాంబోలో  వచ్చిన ఈ మూవీ నందమూరి ఫ్యాన్స్ ను మాత్రమే కాదు అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడంలో దూసుకుపోతుంది. మరీ ప్రత్యేకంగా యాక్షన్ ఎపిసోడ్ లు కావాలి అనుకునే వారికి ఈ సినిమా ఒక బెస్ట్ ఆప్షన్ అనే చెప్పాలి.

* ఇక కమర్షియల్ జోనర్ కి కాస్త విభిన్నంగా తెలంగాణలో గ్యాంగ్‌స్టర్‌ నయీం జీవిత కథ ఆధారంగా రూపుదిద్దుకున్న చిత్రం నయీం డైరీస్. ఈ సినిమా తాజాగా డిసెంబర్ 10న విడుదల కాగా మంచి రెస్పాన్స్ ను తెచ్చుకుంటోంది. వైవిధ్య భరిత చిత్రం ఇది...అలాగే  రొమాంటిక్ టచ్ కూడా ఎక్కువగానే ఉంది. గ్యాంగ్ స్టర్ మూవీని బోల్డ్ గా తీర్చి దిద్దారనే చెప్పాలి. విష్ణు సింహ, బిగ్ బాస్ ఫేమ్ దివి ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు.

అయితే ఇవి కాకుండా కొన్ని సినిమాలు థియేటర్ లో రన్ అవుతున్నాయి. మీకు నచ్చిన వాటిని మీరు చూసి ఎంజో చేయవచ్చు.  

మరింత సమాచారం తెలుసుకోండి: