
రజనీకాంత్ వీరాభిమాని అయినటువంటి సౌమ్య గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం మనకు తెలిసిందే.. అయితే ప్రస్తుతం బెంగళూరులో ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నట్లు సమాచారం. మీడియా ద్వారా ఈ విషయం తెలుసుకున్న రజినీకాంత్ ఆ అమ్మాయి త్వరగా కోలుకోవాలని ఒక వీడియో పంపారు.. ఆ వీడియోలో రజినీకాంత్ తన మాతృభాష అయిన తమిళ్ లో మాట్లాడుతూ.. హలో సౌమ్య.. ఎలా ఉన్నారు.. సంతోషంగా ఉండమ్మా.. మీకు ఏమీ కాదు.. సారీ కన్నా ..! నేను మిమ్మల్ని చూడటం కుదరదు లేదు. ప్రస్తుతం నాకు కూడా ఆరోగ్యం బాగాలేదు. నాకు ఆరోగ్యం కుదుటపడి తర్వాత కచ్చితంగా నిన్ను చూడటానికి వస్తాను.
మీరు మీ ఆరోగ్యం గురించి ఏమాత్రం చింతించాల్సిన అవసరం లేదు భయపడకుండా ధైర్యంగా ఉండు మా..! ఏమీ కాదు.. నీకోసం నేను భగవంతుడిని ప్రార్థిస్తాను. ఓకేనా.. చూడు ముఖంలో ఆ నవ్వు ఎంత అందంగా ఉందో.. చాలా చక్కగా నవ్వుతున్నావు.. నవ్వుతున్నప్పుడు చాలా అందంగా కూడా కనిపిస్తున్నావు. భయపడొద్దు మా ..చాలా బాగుండు.. నేను నీకోసం ప్రార్థిస్తాను అంటూ రజనీకాంత్ ఒక వీడియో సెండ్ చేయడంతో అభిమాని చాలా సంతోషించినట్లు సమాచారం. అంతేకాదు ఒక అభిమాని కోసం సూపర్ స్టార్ ఇలా వీడియో పంపడం అందరికీ ఆశ్చర్యం గా అనిపించడంతో పాటు నెటిజన్లు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.