పుష్ప సినిమా చూసిన ప్రతి ఒక్కరు పుష్ప రాజ్ గురించి చెబుతూ.. పుష్ప రాజ్ అసిస్టెంట్ గా ఉంటూ మొత్తం సినిమా బన్నీ తర్వాత అంత స్కోప్ ఉన్న పాత్ర చేశాడు కేశవ. రాయలసీమ యాసని యాజిటీజ్ దించేసిన ఈ కుర్రాడు ఎవరు. ఇదే మొదటి సినిమానా.. ఇంతకుముందు ఏదైనా సినిమా చేశాడా.. చేస్తే ఏం చేశాడు అన్నది తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు ఆడియెన్స్. పుష్ప సినిమాలో కేశవ పాత్ర మంచి ఎంటర్టైనింగ్ పాత్ర అని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ మొత్తం అతని కామెడీ మెప్పించింది. హీరో పక్కనే ఉంటూ ఫుల్ లెంగ్త్ పాత్ర చేసిన ఈ నటుడి పేరు జగదీష్ ప్రతాప్ బండారి.

ఇంతకుముందు అతను సినిమా చిన్న సినిమాల్లో నటించాడు. ఆహా వెబ్ సీరీస్ కొత్త పోరడులో కూడా నటించాడు జగదీష్. మల్లేశం, పలాస 1978, జార్జ్ రెడ్డి, పిక్ పాకెట్ సినిమాల్లో నటించాడు జగదీష్ ప్రతాప్. అయితే ఇప్పటివరకు చేసిన సినిమాల్లో అతను చేసిన పాత్రలు అతనికి పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు. కాని పుష్ప లో కేశవ పాత్ర అతనికి సూపర్ క్రేజ్ తెచ్చింది. చిన్న సినిమాలు చేసుకుంటూ వచ్చిన అతను పెద్ద సినిమాలో అల్లు అర్జున్ లాంటి హీరో పక్కన ఫుల్ లెంగ్త్ రోల్ అంటే మంచి ఛాన్స్ అని చెప్పొచ్చు. అయితే అతను కూడా కేశవ పాత్రకి పూర్తి న్యాయం చేశాడు.

పుష్ప పార్ట్ 1 ది రైజ్ లోనే కాదు పార్ట్ 2 ది రూల్ లో కూడా అతని పాత్ర చాలా బాగుంటుందని తెలుస్తుంది. నటించాలనే తపన ఉండి వచ్చిన ప్రతి అవకాశాన్ని చేసుకుంటూ వెళ్తే ఏదో ఒకరోజు మనకు గొప్ప అవకాశం వస్తుందని మరోసారి జగదీష్ ని చూస్తే అర్ధమవుతుంది. కేశవ పాత్రతో తన ప్రతిభ చాటిన జగదీష్ అందరి దృష్టిలో పడ్డాడు. పుష్ప వల్ల అతనికి చాలా మంచి అవకాశాలు రావడం పక్కా అని చెప్పొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: