కులం, మతం , పేద, ధనిక అన్న తేడా లేకుండా ప్రేమ ఎవరినైనా తన ప్రేమతో కట్టేయగలదు. రెండు హృదయాలను ఒక్కటి చేయగలదు. సెలబ్రిటీ అయినా సాధారణ వ్యక్తి అయినా ప్రేమ ముందు ఒక్కటే. ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా అలా ఒంటరిగానే జీవితాన్ని గడిపేస్తున్నారు దానికి కారణం ప్రేమ అని అంతా అంటుంటారు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు ఆ ప్రేమ కథేంటి అంటే...ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నగ్మా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమె తిరిగి వెండి తెరపై కనిపిస్తే బాగుంటుందని అనుకునేవారు ఇప్పటికీ చాలామందే ఉన్నారు. కాగా ఈమె గతంలో ఒక గాఢమైన ప్రేమ కథ ఉందని పెద్ద ప్రచారమే ఉంది.

అదేంటంటే సీనియర్ స్టార్ క్రికెటర్ సౌరవ్ గంగూలీతో నగ్మా పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు అని అయితే గంగూలీకి అప్పటికే వివాహం అయివుండటంతో ఈ విషయం అప్పట్లో వివాదంగా మారిందని అదే కారణంతో వీరిద్దరూ తప్పక విడిపోయారని చాలా వార్తలే వినిపించాయి. అది 1999 వరల్డ్ కప్ సమయం ఆ టైం లో లండన్ లో వీరిద్దరూ కలిసి ఉండటం కెమెరా కళ్ళకు చిక్కాయి. అప్పటి నుండి వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోంది అంటూ పుకార్లు మొదలయ్యాయి. కానీ ఈ రూమర్లకు వారు ఇరువురు కూడా దూరంగా ఉంటూ వచ్చారు. అయితే ఆ మధ్య ఒకసారి మళ్ళీ 2002 లో సర్ప దోష నివారణ కోసం శ్రీకాళహస్తి కి విచ్చేసిన నగ్మాతో గంగూలీ కూడా కలిసి కనిపించడంతో ఈ వార్తలు మరింత పెరిగాయి.

మొదట ఈ వార్తలను తోసిపుచ్చిన నగ్మా... అవును గంగూలీతో నాకు ఎఫైర్ ఉంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. అయితే కొన్నాళ్లకి ఏమయ్యిందో ఏమో గానీ వీరి రిలేషన్ బ్రేక్ అయినట్లు వార్తలు వినిపించాయి. సౌరభ్ గంగూలీ తన ఫ్యామిలీతో తాను హ్యాపీగా ఉంటున్నారు. నగ్మా మాత్రం వయసు నాలుగు పదులు దాటుతున్నా ఇప్పటికీ సింగిల్ గానే లైఫ్ లో ముందుకు వెళుతున్నారు. ఆ ప్రేమ జ్ఞాపకాలతో తను పెళ్లి చేసుకోవడం లేదు అన్నది కొందరి వాదన. నగ్మ చెల్లెలు హీరోయిన్  జ్యోతిక మాత్రం హీరో సూర్య ని వివాహం చేసుకుని తన వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్న విషయం తెలిసిందే

మరింత సమాచారం తెలుసుకోండి: