యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా ఎస్ ఎస్ రాజమౌళి తీస్తున్న భారీ పేట్రియాటిక్ యాక్షన్ డ్రామా మూవీ ఆర్ఆర్ఆర్. ఎన్టీఆర్ కొమురం భీంగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా యాక్ట్ చేస్తున్న ఈ సినిమాని టెక్నీకల్ గా అలానే భారీ యాక్షన్ హంగులతో ఎంతో అత్యద్భుతంగా దర్శకుడు రాజమౌళి తెరకెక్కించినట్లు సమాచారం.

డివివి దానయ్య నిర్మించిన ఈ భారీ పాన్ ఇండియా సినిమాలో సముద్రఖని, అజయ్ దేవగన్, శ్రియ, రాహుల్ రామకృష్ణ, రాజీవ్ కనకాల, ఆలిసన్ డూడి, రే స్టీవెన్సన్ తదితరులు ఇతర పాత్రలు చేయగా అలియా భట్, ఒలీవియా మోరిస్ కథానాయికలుగా నటించారు. ఇక మరోవైపు ఇటీవల ఈ సినిమా నుండి రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్లు, థియేటరికల్ ట్రైలర్ సినిమాపై అందరిలో ఆకాశమే హద్దుగా అంచనాలు ఏర్పరిచాయి. దాదాపుగా 14000 థియేటర్స్ లో 2022, జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా ఎంతో భారీ ఎత్తున రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ఇటీవల మొదలెట్టింది యూనిట్. అయితే విషయం ఏమిటంటే, ఈ సినిమా నుండి నేడు తెలంగాణ గోండు వీరుడు కొమురం భీం పాత్ర యొక్క ఔచిత్యాన్ని తెలిపే సాంగ్ ని కొద్దిసేపటి క్రితం యూట్యూబ్ లో రిలీజ్ చేసారు యూనిట్. సుద్దాల అశోక్ తేజ ఎంతో గొప్పగా రాసిన ఈ సాంగ్ ని మరింతగా హృదయానికి హత్తుకునేలా యువ గాయకుడు కాల భైరవ అద్భుతంగా ఆలపించారు.

'కొమురం భీముడో కొమురం భీముడో రగ రాగ సూరీడై రాగలాలి కొడుకో' అంటూ ఎమోషనల్ గా సాగుతూ అందరినీ ఎంతో ఆకట్టుకుంటున్న కొమురం భీముడో సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్ లో మంచి వ్యూస్, లైక్స్ అందుకోవడంతో పాటు అందరి నుండి మంచి ప్రశంసలు అందుకుంటోంది. అద్భుతమైన లిరిసిస్ట్ గా ఎన్నో గొప్ప పాటలు రాసిన సుద్దాల, ఈ పాటలోని 'కాలువై పారే నీ గుండె నెత్తురు నేలమ్మా నుదుటి బొట్టైతుంది సూడు, అమ్మ కాళ్ళ పారాణైతుంది సూడు' వంటి లిరిక్స్ నిజంగా మనసును కదిలిస్తాయి. కాగా మరొక రెండు రోజుల్లో అల్లూరి సీతారామరాజు పాత్రకి సంబందించిన సాంగ్ ని యూనిట్ రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. మరి అందరిలో ఎన్నో భారీ అంచనాలు ఏర్పరిచిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎంత మేర విజయాన్ని సొంతం చేసుకుంటుందో తెలియాలి అంటే మరికొన్నాళ్ళుగా ఆగాల్సిందే.

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: