సౌత్ స్టార్ హీరోయిన్ సమంత తన ప్రతి విషయంలో ఆడియెన్స్ ను సర్ ప్రైజ్ చేస్తూ వస్తుంది. ఆఫ్టర్ డైవర్స్ తన ఫుల్ కాన్సెంట్రేషన్ సినిమాల మీద పెట్టిన సమంత నటించడమే ముఖ్య ఉద్దేశంతో అది సినిమా అయినా వెబ్ సీరీస్ అయినా ఓకే అనేస్తుంది. ఈ క్రమంలో సమంత అమేజాన్ ప్రైం కోసం కొత్త వెబ్ సీరీస్ చేస్తుంది. ఫ్యామిలీ మ్యాన్ సృష్టించిన రాజ్ డీకే లు ఈ వెబ్ సీరీస్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ వెబ్ సీరీస్ కు సిటాడెల్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు.

స్పై థ్రిల్లర్ గా రాబోతున్న ఈ వెబ్ సీరీస్ లో వరుణ్ ధావన్ మేల్ లీడ్ గా నటిస్తుండగా సమంత ఫీమేల్ లీడ్ గా కనిపించనున్నారు. ఇద్దరూ ఈ వెబ్ సీరీస్ లో గూఢచారులుగా కనిపిస్తారని తెలుస్తుంది. ఇక ఈ వెబ్ సీరీస్ యాక్షన్ సీన్స్ కోసం సమంత, వరుణ్ ధావన్ ఇద్దరూ స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నారని తెలుస్తుంది. అమేజాన్ ప్రైం లో రాబోతున్న ఈ సిటాడెల్ వెబ్ సీరెస్ ను అవెంజర్స్ లాంటి సూపర్ హీరో సినిమాలను డైరెక్ట్ చేసిన రుస్సో బ్రదర్స్ నిర్మిస్తున్నారు.

సిటాడెల్ పేరుతో అమెరికాలో కూడా స్పై థ్రిల్లర్ వస్తుంది. రుస్సో బ్రదర్స్ నిర్మిస్తున్న ఈ వెబ్ సీరీస్ ను కొద్దిగా మార్చి వరుణ్, సమంతలతో తెరకెక్కిస్తున్నారని సమాచారం. అమెరికాలో ఈ వెబ్ సీరీస్ లో మ్యాడెన్, ప్రియాంకా చోప్రా నటిస్తున్నారని చెబుతున్నారు. ఫ్యామిలీ మ్యాన్ 2 తో బాలీవుడ్ ని షేక్ చేసిన సమంత ఇప్పుడు సిటాడెల్ తో తన టాలెంట్ చూపించబోతుంది. తప్పకుండా ఈ వెబ్ సీరీస్ సమంతకు బీ టౌన్ లో ఎక్కువ మైలేజ్ తెచ్చేలా చేస్తుందని చెప్పొచ్చు. అక్కడ మరో క్రేజీ ప్రాజెక్ట్ లో కూడా సమంత డిస్కషన్స్ లో ఉందని బాలీవుడ్ టాక్.


మరింత సమాచారం తెలుసుకోండి: