టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం మోకాలికి సర్జరీ చేయించుకుని దుబాయ్ లో కుటుంబంతో కలిసి రెస్ట్ తీసుకుంటూ గడుపుతున్నారు. ఇక ఆయన లేటెస్ట్ సినిమా సర్కారు వారి పాట ఇటీవల చాలా వరకు షూటింగ్ జరుపుకోగా ప్రస్తుతం ఆయన లేకుండా పలు ఇతర సీన్స్ తీస్తోంది యూనిట్. అందుతున్న సమాచారం ప్రకారం ఫిబ్రవరి మొదటి వారంలో మహేష్ బాబు ఇండియా కి తిరిగి వస్తారని ఆ వెంటనే మిగిలిన భాగం షూట్ చేసి పక్కాగా అనుకున్న విధంగా ఏప్రిల్ 1న సర్కారు వారి పాట మూవీ ని థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నారని సమాచారం.

దీని తరువాత త్రివిక్రమ్ తో ఒక భారీ యాక్షన్ కమర్షియల్ మూవీ చేయనున్నారు మహేష్ బాబు. సూర్యదేవర రాధాకృష్ణ నిర్మించనున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందించనుండగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ రెండు సినిమాల అనంతరం శ్రీ దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ నిర్మాతగా మహేష్ బాబు తన కెరీర్ లోనే ప్రెస్టీజియస్ ప్రాజక్ట్ ని రాజమౌళి దర్శకత్వంలో చేయనున్నారు. ఎప్పుడో కార్యరూపం దాల్చాల్సిన ఈ సినిమా అప్పటి నుండి వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు ఈ మూవీని వచ్చే ఏడాది చివర్లో మొదలెట్టనున్నట్లు టాక్. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్న రాజమౌళి ఆ తరువాత నాలుగు నెలల విరామం అనంతరం మహేష్ మూవీ స్టోరీ, స్క్రిప్ట్ డిస్కషన్స్ లో పాల్గొంటారట.

ఇక ముఖ్య విషయం ఏమిటంటే పాన్ ఇండియా స్థాయిని మించేలా పాన్ వరల్డ్ రేంజ్ లో తెరకెక్కనున్న ఈ సినిమాని దాదాపుగా రూ.800 కోట్లకు పైగా భారీ ఖర్చుతో నిర్మించే ఛాన్స్ ఉందనేది లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. ఇటీవల ఈ సినిమాని సౌత్ ఆఫ్రికా అమెజాన్ అడవుల నేపధ్యంలో జరిగే కథగా తీయాలని ఆలోచన చేస్తున్నట్లు కథకుడు విజయేంద్ర ప్రసాద్ మీడియాకి చిన్న హింట్ ఇచ్చారు. కాగా ఈ సినిమాలో తన కెరీర్ లో ఎన్నడూ కనపడని ఒక న్యూ లుక్ తో పాటు పక్కాగా మాస్ రోల్ లో సూపర్ స్టార్ మహేష్ కనిపించనున్నారని, ఇక సినిమాని ఖర్చు, గ్రాండియర్ విషయమై నిర్మాత నారాయణ ఎక్కడ కూడా కంప్రమైజ్ కాకుండా తేయేలనే ఆలోచనతో ఇంత భారీగా దీనికి ఖర్చు చేయనున్నారని సమాచారం. మరి ఇదే కనుక నిజం అయితే ఈ ప్రాజక్ట్ యావత్ ఇండియాలోనే మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజక్ట్ గా నిలవడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: