దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్.ఆర్.ఆర్ సినిమా గురించి భారత సినీ ప్రపంచం మొత్తం ఎంతగానో ఎదురు చూసింది. ఇప్పటికే ఎన్నో సార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఈసారి మాత్రం ముందుగా అనుకున్న విధంగానే జనవరి 7వ తేదీన విడుదల కావడం పక్క అని ప్రేక్షకులు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం వేళ్లపై రోజులు లెక్కపెట్టడం కూడా చేశారు. చివర్లో ఆర్ఆర్ఆర్ చిత్రబృందం మాత్రం ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. సినిమా విడుదలను మళ్లీ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.దీంతో సినీ ప్రేక్షకులు అందరికి కూడా నిరాశే ఎదురైంది అని చెప్పాలి.


 అయితే ఆర్.ఆర్.ఆర్ సినిమా విడుదలను వాయిదా వేయాలని దర్శక ధీరుడు రాజమౌళి తీసుకున్న నిర్ణయం కాస్త చిన్న సినిమాలకు వరంగా మారిపోయింది అని అంటున్నారు విశ్లేషకులు.  సినిమాల విడుదలకు సంక్రాంతి ఎంతో స్పెషల్. సంక్రాంతికి విడుదలైన సినిమాలు దాదాపు విజయం సాధించడం ఖాయం అని భావిస్తూ ఉంటారు. ఈ ఏడాది సంక్రాంతికి ఆర్.ఆర్.ఆర్ సినిమా విడుదల ఉండటంతోఎన్నో సినిమాలు పక్కకు తప్పుకున్నాయ్. ఆర్ఆర్ఆర్ సినిమా వాయిదా పడటంతో ఇక చిన్న చిత్రాల నిర్మాతలకు ఇది ఒక జాక్పాట్ గా మారిపోయింది. ఒకవేళ జనవరి ఫిబ్రవరి నెలలలో తమ సినిమాను విడుదల చేస్తే ఆర్ఆర్ఆర్ కొట్టుకుపోతాయని భయపడ్డారు.


 కానీ ఇప్పుడు మాత్రం సంక్రాంతి సీజన్ ను క్యాష్ చేసుకోవాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నటించిన డీజే టిల్లు   జనవరి 14 వ తేదీన విడుదల చేస్తామని ప్రకటించారు. తర్వాత రోజు 'హీరో' సినిమా విడుదల ఉంటుందని నిర్మాతలు ప్రకటించారు. ఈ సినిమాలో గల్లా జయదేవ్ కొడుకు గల్ల అశోక్ హీరోగా పరిచయమవుతున్నారు. డిసెంబర్ 31న విడుదల కావాల్సిన 1947 చిత్రాన్ని ఫిబ్రవరిలో విడుదల చేస్తామని చెప్పిన చిత్రబృందం ఇప్పుడు జనవరి 7వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటన చేశారు.  నాగార్జున నాగచైతన్య.. బంగార్రాజు సినిమా కూడా ఫిబ్రవరిలో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది  ఇలా మరికొన్ని చిన్న చిత్రాలు కూడా సంక్రాంతి బరిలో నిలిచేందుకు సిద్ధమవుతున్నాయ్. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అటు మరో పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్ కూడా వాయిదా పడే అవకాశం ఉందని  విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: