మాస్ డైరెక్టర్ బి.గోపాల్, బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన సినిమా సమరసింహారెడ్డి. ఈ సినిమా కంటే ముందు వీరిద్దరూ కలిసి లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్పెక్టర్ సినిమాలను తెరకెక్కించగా.. ఈ చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే హ్యాట్రిక్ సినిమా కోసం దర్శకుడు కథ విషయంలో ఎక్కడ రాజీపడలేదు. ఈ సినిమా కోసం విజయేంద్రప్రసాద్ స్టొరీని అందించారు. ఈ సినిమాను 999 జనవరి 13న విడుదల చేసింది. ఈ సినిమా భారీగా కలెక్షన్ల వర్షం కురిపించింది.

ఇక సినిమా కథ విషయానికి వస్తే.. సిందూరపువ్వు అనే తమిళ సినిమా నుంచి మెయిన్ కథని తీసుకొని, కొన్ని మార్పులు చేసి విజయేంద్రప్రసాద్ సమరసింహారెడ్డి సినిమా కథను రెడీ చేశారు. అయితే అప్పటికి విజయేంద్రప్రసాద్ దగ్గర సహాయకుడిగా పనిచేస్తున్న రత్నం సలహా మేరకు సినిమా కథకి రాయలసీమ ఫాక్షన్ ని జత చేసినట్లు సమాచారం.

అయితే అప్పట్లో లవ్ ట్రాక్ లేకుండా బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టిన మొదటి సినిమా ఇదేనంట. ఇక ఫ్యాక్షన్ బేస్డ్ కథాంశంతో ఇండస్ట్రీ హిట్ అయిన మొదటి సినిమా కూడా ఇదే కావడం విశేషం అని చెప్పాలి.ఈ మూవీ తరువాత చాలా ఫ్యాక్షన్ సినిమాలను చిత్రీకరించారు. ఇక ముందుగా ఈ సినిమాకి సమరసింహం అనే టైటిల్ ని అనుకోగా.. పరుచూరి గోపాలకృష్ణ సలహా మేరకు సమరసింహారెడ్డిగా టైటిల్ ఖరారు చేశారు. సంగీత దర్శకుడు మణిశర్మ, బాలయ్య కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా ఇదే.

అంతేకాదు.. ఈ సినిమాలో ముందుగా రాశి, సంఘవి, అంజలా జవేరిలని హీరోయిన్లుగా తీసుకోవాలి అనుకున్నారు. కాగా.. రాశి.. సినిమాలోని సీతాకోకచిలుక సన్నివేశానికి ఒప్పుకోకపోవడంతో ఆమె ప్లేస్ లో సిమ్రాన్ ని తీసుకోవాల్సి వచ్చింది. ఈ సినిమాను ఆరు కోట్లతో చిత్రీకరించగా.. ఏకంగా 16 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాని మూడు థియేటర్లలో 227 రోజులు, 29 కేంద్రాలలో 175 రోజులు, 122 కేంద్రాలలో 50 రోజులు, 73 కేంద్రాలలో 100 రోజులు ప్రదేశించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: