ప్రస్తుతం హాలీవుడ్ రేంజ్ పాన్ ఇండియా వరకు ఎగబాకి తెలుగు సినిమాల స‌త్తా చూపిస్తున్నారు. ముఖ్యంగా దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి చిత్రము రెండు భాగాలు ఎటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధాన భాషలన్నింటిలో అటు ప్రపంచవ్యాప్తంగా కూడా విజయ దుందుభి మోగించి నా విషయం విధితమే. ఇక అప్పటి నుంచి తెలుగు దర్శకులు నిర్మాతలు సినిమాల రేంజ్ అమాంతం పెంచేశారు. ఇక ఇటీవల విడుదల అయిన అల్లు అర్జున్ పుష్ప సినిమా ఉత్తరాది విడుదల ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇక తెలుగుతో పాటు తమిళం, కన్నడం, మలయాళం, హిందీ ఇలా ఐదు భాషల్లో పుష్ప విడుదలై రికార్డు సృష్టించినది.

ఇక ఈ దెబ్బ‌తో బ‌న్నీ సినిమాలు అన్ని బాలీవుడ్‌లో విడుద‌ల అవ్వ‌డానికి సిద్ధం అవుతున్నాయి. 2020 సంక్రాంతి పండుగ సంద‌ర్భంగా బ‌న్నీ- త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ లో వ‌చ్చిన అల వైకుంఠ‌పురంలో.. ఎంత‌టి విజయం సాధించిన‌దో తెలిసిందే. అయితే ఆ చిత్రాన్ని జ‌న‌వ‌రి 26న హిందీలో విడుద‌ల చేయ‌డానికి పూనుకున్నారు.  దీనితో పాటు తెలుగులో మ‌రొక సినిమాను కూడా విడుద‌ల చేసేందుకు హిందీలో స‌త్తా ఏమిటో నిరూపించ‌డానికీ రెడీ అవుతుంది టాలీవుడ్ బృందం.

సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన‌టువంటి మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌తేజ కెరీర్ బెస్ట్ సినిమాగా నిలిచిన రంగ‌స్థ‌లం కూడా హిందీలో విడుద‌ల అవ్వ‌నున్న‌ది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ప్ర‌ముఖ బాలీవుడ్ నిర్మాత అయిన‌టువంటి మ‌నీష్ షాహా వెల్ల‌డించారు. జ‌న‌వ‌రి 26న అల వైకుంఠ‌పురంలో విడుద‌ల చేస్తాం అని.. ఫిబ్ర‌వ‌రి నెల‌లో రంగ‌స్థ‌లం విడ‌ద‌ల చేస్తాం అని ప్ర‌క‌ట‌న కూడా చేసారు. హిందీ ప్రేక్ష‌కులు తెలుగు సినిమాల‌ను ఎంతో బాగా ఇష్ట‌ప‌డుతున్నార‌ని.. దాని వ‌ల్ల త‌మ‌కు కూడా లాభాలు వ‌స్తున్నాయ‌ని వివ‌రణ ఇచ్చారు.

ఫిబ్ర‌వ‌రి తొలి వారంలో రంగ‌స్థ‌లం విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం అని పేర్కొన్నారు. ఇక వీటితో పాటు కోలీవుడ్ స్టార్ హీరోలు అయిన‌టువంటి విజ‌య్ న‌టించిన మెర్స‌ల్‌, అజిత్ న‌టించిన విశ్వాసం కూడా హిందీలో విడుద‌ల చేసేందుకు ప్ర‌య‌త్నాలు కూడా జ‌రుగుతున్నాయ‌ని చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా టాలీవుడ్ ఇండ‌స్ట్రీ అంచ‌లంచెలుగా ఎద‌గ‌డం ఎంతో గ‌ర్వించ‌ద‌గ్గ విష‌యం అని ప‌లువురు అభిమానులు ఆనందం, సంతోషం వ్య‌క్తం చేస్తూ ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: