ఆరు పదులు దాటినా అగ్ర హీరో మెగాస్టార్ చిరంజీవి స్పీడ్ మామూలుగా లేదు. ఎవర్గ్రీన్ హ్యాండ్ సమ్ స్టార్ మెగాస్టార్ చిరు ఇపుడు వరుస చిత్రాలతో బిజీ షెడ్యుల్ తో పరుగులు తీస్తున్న విషయం తెలిసిందే. చిరు చేతిలో ఇపుడు అర డజనుకు పైగానే సినిమాలు లైన్ లో ఉన్నాయి. అందులో ఇపుడు 'లూసిఫర్' మూవీ సెట్స్ పై ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రానికి సంబందించిన లేటెస్ట్ న్యూస్ ఒకటి మెగా ఫ్యాన్స్ ను ఆశ్చర్యపరుస్తోంది. చిరు లేటెస్ట్ మూవీ లూసిఫర్ లో అగ్ర హీరోయిన్ త్రిష ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. మొదట ఆ పాత్ర కోసం సీనియర్ హీరోయిన్ శ్రియను అనుకోగా ఆ తరవాత ఆ స్పెషల్ రోల్ కోసం త్రిషను ఎంపిక చేసినట్లు టాక్.

అయితే ఈ విషయంలో ఇప్పటి వరకు అధి కారిక సమాచారం అయితే లేదు. ఒక వేళ ఇది నిజం అయితే మరో సారి మెగా స్టార్ పక్కన త్రిష స్టెప్పులు వేయనుంది. కాగా ఈ సినిమా గురించి మరో వార్త వినిపిస్తోంది. ఇందులో ఒక సాంగ్ లో స్పెషల్ అప్పీరెన్స్ గా బాలకృష్ణ కనిపించ నున్నాడని టాక్ వినిపిస్తోంది. సోషల్ మీడియా రోజు రోజుకి ఎంతలా హైలైట్ అవుతోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులో నుండి పుట్టుకు వచ్చిన ఒక వార్తల దీనిని అనుకోవాలా లేదా నిజంగానే బాలకృష్ణ ఈ చిత్రంలో కనిపిస్తారా అన్నది తెలియాలంటే పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది.

కాగా ఈ సినిమా దాదాపుగా షూటింగ్ పూర్తి అయినట్లే అని తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి రెండు రోజుల క్రిందట కోవిడ్ బారిన పడిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన ఇంట్లోనే సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నారు. త్వరలోనే కోలుకుంటారని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: