హీరో గోపీచంద్ శ్రీవాస్ కాంబినేషన్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ అనే అందరికి తెలిసిందే. ఈ కాంబినేషన్ లో తెరకెక్కిన లక్ష్యం మరియు లౌక్యం సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ హిట్లుగా నిలిచాయి.

అయితే ఈ రెండు సినిమాలు మినహా శ్రీవాస్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలన్నీ ఫ్లాపులుగా నిలిచిన విషయం తెలిసిందే. అయితే గోపీచంద్ శ్రీవాస్ కాంబినేషన్ లో మరో ప్రాజెక్ట్ తెరకెక్కనుంది. మల్టీస్టారర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో రాజశేఖర్ నటిస్తున్నారని వార్తలు ప్రచారంలోకి వచ్చాయట . అయితే తాజాగా తెలుసుకోన్న సమాచారం ప్రకారం రాజశేఖర్సినిమా నుంచి తప్పుకున్నారని రాజశేఖర్సినిమా నుంచి తప్పుకోవడానికి వేర్వేరు కారణాలు ప్రచారంలోకి వస్తుండగా జీవిత లేదా రాజశేఖర్ స్పందిస్తే మాత్రమే వైరల్ అయిన వార్తలలో నిజానిజాలు తేలే అవకాశం ఉంటుందట.. ప్రస్తుతం ఈ సినిమాలో రాజశేఖర్ ఎంపికైన రోల్ కోసం మరో నటుడిని వెతికే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయని సమాచారం.. జగపతిబాబు, శ్రీకాంత్ లలో ఎవరో ఒకరు ఈ పాత్రకు ఎంపికయ్యే ఛాన్స్ అయితే ఉందని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తుండటం విశేషం.మరోవైపు శ్రీవాస్ ఈ సినిమాతో కచ్చితంగా భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను సాధించాల్సి ఉందట.ఈ సినిమా కూడా ఫ్లాప్ అయితే శ్రీవాస్ కెరీర్ ఇబ్బందుల్లో పడే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు మరోవైపు గోపీచంద్ కెరీర్ కూడా అంతగా లేదనే విషయం అందరికి తెలిసిందే.

గోపీచంద్ నటించిన పక్కా కమర్షియల్ సినిమా ఈ ఏడాదే రిలీజ్ కానుందని తెలుస్తుంది . మారుతి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాపై పరవాలేదనే స్థాయిలో అంచనాలు నెలకొన్నాయట . గోపీచంద్ తర్వాత సినిమాలతో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాలి మరి. గోపీచంద్ సక్సెస్ ట్రాక్ లోకి రావాలని అతని అభిమానులు అయితే బాగా కోరుకుంటున్నారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: