
డీజే టిల్లు.. గత రెండు మూడు వారాల నుంచి తెలుగు సినీ ఇండస్ట్రీకి కొత్త హీరోలు పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. అయితే వీరంతా కూడా సినీ బ్యాక్ గ్రౌండ్ తో వచ్చి ఇండస్ట్రీలో సక్సెస్ అవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇకపోతే మరో కొత్త హీరో సిద్దు జొన్నలగడ్డ కూడా ఇండస్ట్రీలోకి డీజే టిల్లు అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. రొమాంటిక్ యాక్షన్ కామెడీ మూవీ గా తెరకెక్కబోతున్న ఈ సినిమాకి కూడా ప్రముఖ నూతన దర్శకుడు డైరెక్ట్ చేయడం గమనార్హం.. ప్రతిభ ఉంటే నటీనటులను ఆహ్వానించడానికి తెలుగు సినీ ఇండస్ట్రీ ఎప్పుడూ ముందే ఉంటుంది అని చెప్పడానికి ఇదో చక్కటి నిదర్శనం అని చెప్పవచ్చు.
కొత్త దర్శకుడైన విమల్ కృష్ణ దర్శకత్వంలో కొత్త హీరో సిద్దు జొన్నలగడ్డ డిజే టిల్లు సినిమా ద్వారా ఫిబ్రవరి 11 2022న థియేటర్లలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇకపోతే తాజాగా అందుతున్న వార్త ఏమిటంటే అధికారిక థియేట్రికల్ ట్రైలర్ ను 2022 ఫిబ్రవరి 2న సాయంత్రం 4:05 గంటలకు విడుదల చేయబోతున్నామని ఈ రోజు అధికారికంగా ప్రకటన ఇచ్చారు. థియేట్రికల్ ట్రైలర్ ను ఎవరు విడుదల చేస్తారు అనే విషయాన్ని మాత్రం నిర్మాతలు ప్రకటించలేదు.
