
ఇక తాజాగా డీజే టిల్లు లో హీరో సిద్ధూ సరసన నేహా నటిస్తోంది.ఈ మూవీ ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా.. కరోనా వల్ల వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా ఈ సినిమా టీజర్ ట్రైలర్ ను విడుదల చేయడం జరిగింది. అందులో ముద్దు గుమ్మ నేహా శెట్టి ఘాటైన లిప్ లాక్ లతో కుర్రకారును బాగా కనెక్ట్ అయ్యేలా కనిపిస్తోంది. ఇక ఈమె తెలుగులో మరిన్ని అవకాశాలు అందుకోవాలంటే కచ్చితంగా డిజె టిల్లు మూవీ సక్సెస్ కావాల్సిందే.ఎంత అందం ఉన్నప్పటికీ సక్సెస్ అయ్యారంటే చాలు తమ పేరు బాగా పాపులర్ అవుతూ ఉంటుంది. ఇక ఈ సినిమా ఈ నెల 11వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది.
ఇక ఈ సినిమా ప్రచారాన్ని కూడా చిత్రబృందం చాలా వేగవంతంగా చేస్తోంది.. ఇక ఇందులోని భాగంగానే ఒక పాటను కూడా విడుదల చేయడం జరిగింది. ఈ పాటలో హీరోయిన్ నేహా శెట్టి.. లుక్స్, అందం ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న ట్లుగా సమాచారం. ఈ సినిమాకి అనిరుధ్ పాటలను అందించాడు.సినిమా విడుదలైన తర్వాత మరి కొన్ని పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయని చిత్రబృందం మంచి కాన్ఫిడెంట్ తో ఉన్నారట. ఇక ఇందులో యాక్టర్ బ్రహ్మాజీ, ప్రగతి, తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు.