టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ఇటీవల క్రాక్ సినిమాతో భారీ హిట్ అందుకున్న ఈ హీరో ఇప్పుడు వరుస సినిమాలను లైన్లో పెట్టాడు. రవితేజ నటిస్తున్న సినిమాల్లో 'ఖిలాడి' సినిమా ఒకటి. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని ఏ స్టూడియోస్ ఏ స్టూడియోస్ ఎల్ ఎల్పీ పతాకంపై సత్యనారాయణ కోనేరు వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సినిమాలో  రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి హీరోయిన్స్ గా నటిస్తుండగా.. యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు ముస్తాబవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. 

ఈ క్రమంలోనే ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన పాటలు మంచి రెస్పాన్స్ ని అందుకున్నాయి. ఇక తాజాగా కిలాడి నుంచి మరో అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది చిత్రబృందం. ఈ సినిమా నుంచి 5 వ పాట ను విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ సినిమా దర్శకుడు రమేష్ వర్మ స్వయంగా ట్విట్టర్ వేదికగా కిలాడి సినిమా లోని 'క్యాచ్ మీ' అనే 5 వ పాటను ఫిబ్రవరి 5 వ తేదీన విడుదల చేస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. ఈ మేరకు ఓ పోస్టర్ను కూడా విడుదల చేశారు. ఇక పోస్టర్లో హీరోయిన్ వైట్ డ్రెస్ లో చాలా హాట్ గా కనిపిస్తోంది. 

చూస్తుంటే సినిమాలో ఇది మరో మాస్ సాంగ్ అని స్పష్టమవుతోంది. ఇప్పటికే దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా పాటలు బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ఇప్పుడు సినిమాలోని ఐదవ పాట కూడా ఫుల్ మాస్ నెంబర్ తో ఉండబోతోందని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ఫిబ్రవరి 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇక ఈ సినిమాతో రవితేజ మొదటి సారి బాలీవుడ్ లోకి అడుగుపెట్టబోతున్నాడు.ఈ సినిమాని డబ్బింగ్ వెర్షన్ తో హిందీలో విడుదల చేయనున్నారు మేకర్స్. అన్నట్టు ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: