టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు అగ్ర హీరోలు సంవత్సరానికి నాలుగు సినిమాలతో బిజీగా ఉండేవారు. అంతేకాదు సంవత్సరానికి 10 సినిమాలు రిలీజ్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. అంత తొందరగా సినిమా రిలీజ్ అవ్వాలంటే అంతే ఎక్కువ కష్టపడాలి. ఇక ఒకప్పటి అగ్ర హీరోలు ఒకే రోజు రెండు సినిమా షూటింగ్స్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. రోజుకి రెండు షిఫ్ట్ లు పని చేసేవారు. కానీ ఇప్పటి హీరోలు చూసుకుంటే సంవత్సరానికి ఒక సినిమా రిలీజ్ చేయడమే గగనం అయిపోతుంది. దానికితోడు కరోనా దెబ్బతో సినిమాలు కాస్త నత్తనడకన సాగుతున్నాయి.

అయితే టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి ఇటీవల సినిమాల విషయంలో స్పీడ్ పెంచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మెగాస్టార్ చేతిలో దాదాపు ఏడు సినిమాలు ఉన్నాయి. అందులో ఒక సినిమా షూటింగ్ పూర్తి అవగా.. మూడు సినిమాలు ఒకేసారి షూటింగ్ నడుస్తున్నాయి. ఇటీవల కరోనా వచ్చి కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్నారు చిరు. అయితే ఇప్పుడు తగ్గడంతో మళ్లీ బ్యాక్ టు బ్యాక్ మోడ్ లో వచ్చేసారు. ఇక చిరు నటించిన ఆచార్య షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. మరోవైపు గాడ్ ఫాదర్, భోళా శంకర్ మరియు బాబి దర్శకత్వంలో చేస్తున్న సినిమా ఒకేసారి షూటింగ్లు జరుపుకుంటున్నాయి. చిరంజీవి ఈ మూడు సినిమాలకు సమానంగా డేట్స్ అడ్జస్ట్ చేస్తున్నారు.

ఇక ప్రస్తుతం మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ లో పాల్గొంటున్నారు చిరు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ కోసం కోలీవుడ్ హీరోయిన్ నయనతార హైదరాబాద్ కి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం చిరంజీవి ఒకవైపు గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్ లో పాల్గొంటూనే.. మరోవైపు రాత్రిపూట ఆచార్య సినిమాకు డబ్బింగ్ చెబుతున్నారట. ప్రస్తుతం ఆచార్య పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. సినిమా రిలీజ్ డేట్ ని కూడా ఫిక్స్ చేశారు. ఈ సినిమా ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పొద్దున్న షూటింగ్..రాత్రికి డబ్బింగ్ పనులతో చాలా బిజీ అయిపోతున్నారు చిరంజీవి. దీంతో మెగాస్టార్ ని చూసి ఇప్పటి హీరోలు చాలా నేర్చుకోవాలి అంటూ ఇండస్ట్రీ పెద్దలు అంటున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: