సాధారణంగా ఇండస్ట్రీలో కొంతమంది దర్శకులు సెంటిమెంట్ ని నమ్ముతూ ఉంటారు. అలాగే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఓ సెంటిమెంట్ ని నమ్ముతుంటారు. ఆ సెంటిమెంట్ ఏంటంటే.. తన సినిమాల్లో హీరోయిన్లకు మంచి క్యారెక్టర్ ఇస్తుంటారు. అంతేకాదు.. త్రివిక్రమ్ శ్రీనివాస్ కి బాగా కలిసివచ్చిన హీరోయిన్లకు మళ్లీ మళ్లీ అవకాశాలను ఇస్తుంటారు. అయితే తాజాగా ఓ హీరోయిన్ కు ముచ్చటగా మూడోసారి అవకాశం ఇచ్చాడు.. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో ఒక్కసారి చూద్దామా.

తెలుగు చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ మహేష్ తో త్రివిక్రమ్ మూడో సినిమా స్టార్ చేశాడు. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ అవకాశాన్ని అందుకుంది. ఇక పూజా హెగ్డే త్రివిక్రమ్ సినిమాలో నటించడం ముచ్చటగా మూడోసారి. ఆమె నటించిన రెండు సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఆమె నటించిన సినిమాలో ఆమె డబ్బింగ్ చెప్పుకుంది. ఇక తాజాగా మాటల మాంత్రికుడు మహేష్ సినిమాలోనూ ఆమెను హీరోయిన్ గా ఓకే చేశాడు.

అయితే త్రివిక్రమ్ పూజా ఒక్కతే కాదు.. గతంలోనూ పలువురు హీరోయిన్లను తన సినిమాల్లో మళ్లీ మళ్లీ హీరోయిన్ గా తీసుకుంటున్న సంగతి అందరికి తెలిసిందే. అంతేకాదు.. సమంతాను కూడా ఇలాగే బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు హీరోయిన్ గా ఓకే చేశాడు. మొదట పవన్ కళ్యాణ్ మూవీ అత్తారింటికి దారేదితో పాటు బన్నీ మూవీ సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో సమంతను హీరోయిన్ గా తీసుకున్నాడు. ఇక మొత్తానికి ఇప్పటి వరకు పూజాతో పాటు సమంతాను మూడు సార్లు రిపీట్ చేశారనే చెప్పాలి మరి. అలాగే గోవా గ్లామర్ బ్యూటీ ఇలియానాను కూడా తన రెండు సినిమాల్లో హీరోయిన్ గా తీసుకోగా.. పవర్ స్టార్ పవన్ జల్సా సినిమాలో ఈ ముద్దుగుమ్మకు హీరోయిన్ గా అవకాశం ఇచ్చారు. ఆ తరువత అల్లు అర్జున్ హీరోగా నటించిన జులాయి సినిమాలోనూ మూడోసారి హీరోయిన్ గా తీసుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: