రాక్ స్టార్ యాష్ హీరోగా ప్రశాంత్ నీల్ ప్రస్తుతం తీస్తున్న భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ కెజిఎఫ్ చాప్టర్ 2. మూడేళ్ళ క్రితం కన్నడలో తెరకెక్కి పాన్ ఇండియా మూవీగా దేశవ్యాప్తంగా రిలీజ్ అయి అన్ని భాషల్లో కూడా పెద్ద సక్సెస్ అందుకున్న కెజిఎఫ్ చాప్టర్ 1 మూవీకి సీక్వెల్ గా మరింత భారీ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న కెజిఎఫ్ చాప్టర్ 2 పై దేశవ్యాప్తంగా ఉన్న అన్ని భాషల ఆడియన్స్ లో విపరీతమైన అంచనాలు నెలకొని ఉన్నాయి.

శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ భారీ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, అధీర అనే పాత్రలో కనిపించనుండగా కీలకమైన రమిక సేన్ పాత్రలో రవీనా టాండన్ కనిపించనున్నారు. ఇక ఈ సినిమాకి భువన గౌడ కెమెమ్యాన్ గా పని చేస్తుండగా రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇటీవల షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ మూవీని ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నట్లు నిర్మాతలైన హోంబలె ఫిలిమ్స్ వారు ఇటీవల ప్రకటించారు. అయితే లేటెస్ట్ మూవీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా నుండి మొదటి సాంగ్ ఈనెల 25న అన్ని భాషల్లో రిలీజ్ చేయనుందట యూనిట్.

ముఖ్యంగా మొదటి పార్ట్ మాదిరిగా ఈ రెండవ పార్ట్ లో కూడా బీజీఎమ్ తో పాటు సాంగ్స్ కూడా అందరినీ ఎంతో ఆకట్టుకోవడం ఖాయం అని ఇన్నర్ వర్గాల టాక్. ఫస్ట్ సాంగ్ అనంతరం మిగతా సాంగ్స్ ని, ఆపైన ఇతర పాత్రల లుక్స్ తో పాటు మూవీ థియేట్రికల్ ట్రైలర్ ని పక్కాగా రిలీజ్ చేసేలా యూనిట్  ప్రణాళికలు సిద్ధం చేసిందట. హీరో యాష్ అద్బుతమైన యాక్షన్, దర్శకుడు ప్రశాంత్ నీల్ అత్యద్భుత దర్శకత్వ ప్రతిభతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న కెజిఎఫ్ చాప్టర్ 2 మూవీ భారీ సక్సెస్ కొట్టడం ఖాయం అని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న విధంగా కెజిఎఫ్ చాప్టర్ 2 నుండి ఈనెలలో ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయితే ఫ్యాన్స్ కి పండగే అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: