రమేష్ వర్మ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ఖిలాడి.. ఈ సినిమా ఫిబ్రవరి 11వ తేదీన అంగరంగ వైభవంగా విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి హైదరాబాద్లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించగా ఈవెంట్ కి అతిరథమహారధులు లతోపాటు స్టార్ సెలబ్రెటీలు కూడా హాజరవడం జరిగింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో తెలుగులోనే కాకుండా హిందీలో కూడా విడుదల చేయడానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఇకపోతే బాలీవుడ్లో మంచి పేరు పొందిన పెన్ స్టూడియో వారు ఈ సినిమా డబ్బింగ్ రైట్స్ ని సొంతం చేసుకోవడంతో అందరి ఆసక్తి ఈ సినిమాపై ఉండడం గమనార్హం.


నార్త్ సినీ ఇండస్ట్రీలో ఖిలాడి సినిమా లో పెద్ద ఎత్తున విడుదల చేయడానికి ఇప్పటికే పెన్ స్టూడియో సింగిల్ స్క్రీన్ థియేటర్లను బుక్ చేసినట్లుగా బాలీవుడ్ మీడియా నుంచి అందుతున్న సమాచారం. ఈ సినిమా కోసం సింగిల్ స్క్రీన్ కలిగిన థియేటర్లను మాత్రమే ఈ సినిమా కోసం ఎంచుకున్నట్లు సమాచారం. ఇకపోతే పుష్ప సినిమా హిందీ వెర్షన్ లో 100 కోట్లు రాబట్టిన విషయం మనకు తెలిసిందే.. అందుకే ఈ బాటలోనే అక్కడ ఖిలాడి సినిమాకి కూడా ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. పుష్ప సినిమాకు సంబంధించి అత్యధిక వసూళ్లు సింగిల్ థియేటర్ల నుంచి వచ్చాయట. అది కూడా మెట్రో నగరాల్లో కాకుండా చిన్న చిన్న పట్టణాలలోనే ఇలాంటి కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం.


అందుకే ముంబై వంటి నగరాలలో మల్టీప్లెక్స్ థియేటర్ లలో విడుదల చేయకుండా చిన్న చిన్న పట్టణాలు సింగిల్ స్క్రీన్ ఈ సినిమాను విడుదల చేయాలని పెన్ స్టూడియో నిర్ణయించుకున్నట్లు సమాచారం. బాలీవుడ్లో పెద్ద సినిమాలే కాదు కనీసం చిన్న సినిమాలు కూడా విడుదల కావడం లేదు కాబట్టి ఈ సినిమాపై అందరి దృష్టి పడింది అని చెప్పవచ్చు. ఏది ఏమైనా పుష్ప మేనిఫెస్టో ఈ సినిమాకి  కలిసొస్తుందో లేదో తెలియాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: