పవన్ కళ్యాణ్ ఎలా ఉన్నా కూడా ఫ్యాన్స్ క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గదు..ఆ మాటలకు ఫ్యాన్స్ కు పునకాలు రావడం పక్కా..అందుకే ఆయన సినిమల తో పాటు బయట కూడా ఫ్యాన్స్ ఎక్కువగానె ఉన్నారు. పవన్ ఒకవైపు సినిమా లను మరోవైపు రాజకియాలను బ్యాలెన్స్ చెస్తున్నారు. ప్రజల హక్కుల కోసం నేను ఎటువంటి పోరాటాలు చేయడానికి అయిన సిద్ధంగా వుంటాను అని పవన్ చాలా సందర్భాల్లో చెప్పారు. ఇప్పుడు అలానే వున్నారు. ఎప్పుడూ ప్రజల ముందుకు వచ్చినా పవన్ వైట్ డ్రెస్ లో వస్తారు..


కానీ, ఇప్పుడు మరో కొత్త లుక్ లో కనిపిస్తున్నారు. అది సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతుంది.బ్లాక కలర్ షర్ట్ , గ్రే కలర్ ప్యాంటు తో పాటుగా, గడ్డం లేకుండా క్లీన్ షేవ్ తో అదరగొట్టేశాడు.. కొన్ని రోజుల క్రితం పవన్ లైట్ గడ్డం తో కనిపించారు. ఇప్పుడు కాస్త స్టైలిష్ లుక్ లో కనిపించడం పై అభిమానులతో పాటుగా రాజకియాల్లొ కూడా దీని గురించి చర్చలు జరుగుతున్నాయి. ఇది భీమ్లా నాయక్ సినిమా ఎఫెక్ట్ అని చాలా మంది అనుకుంటున్నారు. మొత్తానికి పవన్ కొత్త లుక్ టాక్ అఫ్ ది టాలివుడ్ అవ్వడం విశేషం.


ఇకపోతే పవన్ కళ్యాణ్ సినిమాల విషయాన్నికొస్తే.. ఆయన ప్రస్తుతం వరుస సినిమా లలో నటించెందుకు సిద్ధంగా వున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో మూడు నాలుగు సినిమాలు ఉన్నాయి. భీమ్లా నాయక్ సినిమా  షూటింగ్ చివరి షెడ్యూల్ ను ఫినిష్ చేసే పనిలో ఉన్నారు. మరోపక్క రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినా ఇంకా షూటింగ్ పూర్తీ కాక పోవడం పై సందెహాలు వ్యక్తం అవుతున్నాయి.  క్రిష్ డైరెక్షన్లో కూడా మరో సినిమా చేయనున్నారు. భీమ్లా నాయక్ సినిమా ఈ నెల 25 న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఆ సినిమా ఎ మాత్రం హిట్ టాక్ ను అందుకుంటుందొ చూడాలి.. ఈ సినిమా హిట్ అయితే పవన్ మరో సినిమాకు రెమ్యునరేషన్ కూడా పెంచుతున్నట్లు సమాచారం.. అంతే కాదు తర్వాత సినిమాకు 60 రోజులు మాత్రమే ఇస్తున్నట్లు చెప్పారు..


మరింత సమాచారం తెలుసుకోండి: