అక్కినేని సమంత ఇప్పుడు సినిమాల్లో నిలదొక్కుకునేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో తనకు ఏ అవకాశం వచ్చిన వాటిని వదిలిపెట్టడం లేదు. తాజాగా ఆమె పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ లో కూడా నటించి పోయిన క్రేజ్ ను తిరిగి రాబట్టుకునే విధంగా అడుగులు వేస్తుంది. ఆ విధంగా ఆమె రెండు లేడి ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరించడానికి సిద్దం అవుతుంది. సమంత కెరీర్ లో కొన్ని హిట్ సినిమాలు ఉన్నాయి అలాంటి సినిమాలు ఇప్పుడు చేస్తే తప్పకుండా ఆమె తిరిగి గాడిలో పడినట్లే అని చెప్పాలి.

ఆమె నటించిన తొలి సినిమామాయ చేసావే తోనే ప్రేక్షకులను భారీస్థాయిలో అలరించింది అలా ఆ చిత్రం ఆమెను భారీగా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు పరిచయం చేయించగా ఆ తర్వాత ఆమె వరుస పెద్ద సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం లాంటిది చేస్తే ఇప్పుడు సమంత కు పూర్వ వైభవం వచ్చే అవకాశం తప్పకుండా వచ్చి పెద్ద హీరోయిన్ అయ్యే సూచనలు బాగా కనిపిస్తున్నాయి. అలాంటి సినిమాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

ఆమె లేడీ ఓరియెంటెడ్ సినిమాలను కాకుండా పెద్ద హీరోలతో సరసన నటించే సినిమాలకు ఎక్కువగా ధ్యాస పెట్టాలి. అలా ఆమె కెరీర్ లో సూపర్ హిట్ అయిన అత్తారింటికి దారేది లాంటి చిత్రం ఇప్పుడు ఆమె కనుక చేస్తే తప్పకుండా ప్లస్ గా ఉంటుంది. ఎవరికైనా తొలి సినిమా ఎన్నో తీపి జ్ఞాపకాలను మిగుల్చుతోంది అలా సమంతకు తొలిసినిమా తీపి జ్ఞాపకాలతో పాటు చేదు అనుభవాలను కూడా మిగిలించింది. అలాంటి ప్రేమ కథ చిత్రం ఇప్పుడు ఒకటి చేస్తే బాగుంటుంది అనేది ఆమె అభిమానుల కోరిక. మరి అలాంటి సినిమా అవకాశాలను ఇప్పుడు ఆమెకు దర్శక నిర్మాతలు ఇస్తారా అనేది చూడాలి. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: