టాలీవుడ్‌లో చాలా మంది రచయితల నుంచి దర్శకులుగా మారుతున్న సంగతి మనందరికీ తెలిసిందే.అయితే కొరటాల శివ, సుకుమార్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ వీళ్లంతా స్టార్ రైటర్ల నుంచి దర్శకులుగా మారిన వాళ్లే.ఇక ఈ కోవలోనే స్టార్ రైటర్‌గా పలు సూపర్ హిట్ సినిమాలకు పనిచేసిన తిరుమల కిశోర్ నేను శైలజ సినిమాతో దర్శకుడిగా మారడం జరిగింది.అయితే రామ్ హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్‌గా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో పాటు ఒక్కసారిగా ఇండస్ట్రీ అటెన్షన్ అంతా తిరుమల కిషోర్ వైపే

 మళ్లింది.ఇక తర్వాత కిషోర్ ఉన్నది ఒక్కటే జిందగీ - చిత్రలహరి సినిమాలు కూడా చేశాడు. అయితే ఆ తర్వాత ఈయన తన రూట్‌కు కాస్త భిన్నంగా రామ్‌తో రెడ్ అనే యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కించాడు.ఇక  రెడ్ తర్వాత కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా శర్వానంద్ హీరోగా ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా చేయడం జరిగింది.కాగా ఈ సినిమా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అయితే ఈ సినిమా ప్రమోషన్లలో కిషోర్ కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఇక అవి ఏంటి అంటే సినిమాలో హీరోకు ఐదుగురు అక్కాచెళ్లెల్లు ఉంటారని.. 

అంతేకాదు వారందరి మధ్య భావోద్వేగాలు, వారి సమూహ జీవితాలను ఈ సినిమాలో చక్కగా చూపించామని.. ఇక ఈ సినిమా రన్ టైం 1.41 గంటలు మాత్రమే ఉంటుందని కిషోర్ చెప్పాడు. అంతేకాదు ఆయనకు    చిన్నప్పటి నుంచే కుటుంబ కథ చిత్రాలు అంటే చాలా ఇష్టం అని.. మహేష్‌బాబు మురారి సినిమాను 14 సార్లు చూశానని చెప్పాడు.అయితే ఆడవాళ్లూ మీకు జోహార్లు తర్వాత డీవీవీ దానయ్య బ్యానర్లో ఓ సినిమా చేస్తున్నానని.. ఇందులో నాగచైతన్యను హీరోగా అనుకుంటున్నట్టు చెప్పుకొచ్చాడు.అయితే ఈయన చిన్నప్పటి నుండే బాగా కుటుంబానికి సంబంధించిన కథల సినిమాలను ఎక్కువగా  చూడడానికి ఇష్టపడే వారట. అందుకే ఈయన ఎప్పుడూ ఆ సినిమాలని చూసేవారట...!!!

మరింత సమాచారం తెలుసుకోండి: