సినిమా ఇండస్ట్రీలో ముఖ్యంగా హీరోల విషయంలో సక్సెస్ ఉంటేనే ప్రేక్షకులు అయినా నిర్మాతలైన దర్శకులైన సదరు హీరో కి విలువ ఇస్తూ ఉంటారు. ఒక ఫ్లాప్ అయినా కూడా వారిని పక్కన పెట్టడానికి ఏమాత్రం ఆలోచించరు. అలా వరుస ఫ్లాపులతో హిట్ కోసం తాపత్రయ పడుతూ ప్రేక్షకులలో మంచి సినిమాలతో అలరించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు హీరో రాజ్ తరుణ్. ఆయన హీరోగా చేసిన తొలి సినిమా ఉయ్యాల జంపాల సూపర్ హిట్ కావడంతో ఇండస్ట్రీకి ఓ మేలిమి హీరో దొరికాడు అని అందరూ అనుకున్నారు.

దానికి తగ్గట్లుగానే ఆయన తీసిన రెండో చిత్రం కూడా సూపర్ హిట్ అయ్యింది. అలా సినిమా చూపిస్త మామ ఈ చిత్రంతో మాస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న రాజ్ తరుణ్ హీరోగా దాదాపుగా హీరో గా సెటిల్ అయినట్లుగానే కనిపించాడు. ఇక మూడవ సినిమా కుమారి 21ఎఫ్ సినిమాతో మరొకసారి ప్రేక్షకులను భారీస్థాయిలో ఆలచించాడు. ఆ విధంగా హ్యాట్రిక్ హిట్స్ కొట్టే క్రేజీ హీరోగా మారిపోయిన రాజ్ తరుణ్ ఆ తర్వాత సినిమాల ఎంపికలో చేసిన తప్పులు ఆయన క్రేజ్ రోజు రోజు కీ దిగజారి పోయేలా చేసింది. 

ఆయన క్రేజ్ ఏ విధంగా తగ్గింది అంటే ఆయన మంచి సినిమాలు తీసిన కూడా అవి ఫ్లాప్ సినిమాలు గా అయ్యేవి. ఆ విధంగా ఒరేయ్ బుజ్జిగాడు సినిమాలో ఆయన ప్రేక్షకులను అలరించే సినిమా చేసినా కూడా దాన్ని ఎవరు కూడా పెద్దగా పట్టించుకోలేదు. తాజాగా ఆయన స్టాండప్ రాహుల్ అనే ఓ కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ నేపథ్యంలో ఈ చిత్రం భారీ స్థాయిలో విజయాన్ని అందుకుంటే తప్పా రాజ్ తరుణ్ కెరీర్ ను ఎవరూ కాపాడలేరు. ఆ విధంగా హీరో ఇలా ఈ సినిమాను ప్రేక్షకులకు నచ్చే విధంగా చేసి దాన్ని సూపర్ హిట్ చేసుకుంటాడో చూడాలి. ఇప్పుడు ఈ సినిమా తప్ప మరో సినిమా అవకాశం ఈ హీరో చేతిలో లేదు అంటే నమ్మాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: