యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తొలిసారిగా నటిస్తున్న సినిమా రౌద్రం రణం రుధిరం. రాజమౌళి తీసిన ఈ భారీ ప్రతిష్టాత్మక పాన్ ఇండియా మూవీ పై మన దేశంతో పాటు పలు ఇతర దేశాల ఆడియన్స్ లో కూడా భారీ స్థాయిలో అంచనాలు ఉన్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ కొమరం భీంగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు, థియేట్రికల్ ట్రైలర్ అందరినీ ఎంతో ఆకట్టుకుని సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు క్రియేట్ చేసాయి.

వాస్తవానికి ఈపాటికి థియేటర్స్ లోకి రావాల్సిన ఈ సినిమా మధ్యలో కరోనా పరిస్థితుల కారణంగా అనేకమార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఒలీవియా మోరిస్, అలియా భట్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మించారు. కీరవాణి మ్యూజిక్ అందించిన ఈ సినిమాకి సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాసారు. అల్లూరి, బీమ్ ల జీవితం ఆధారంగా చేసుకుని కొంత కల్పిత అంశాలు జోడించి దర్శకుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా తీసినట్లు టాక్. అయితే విషయం ఏమిటంటే, ఈ నెల 25న భారీ స్థాయిలో రిలీజ్ కానున్న ఈ సినిమాకి సంబంధించి అతి త్వరలో యూనిట్ గట్టిగా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలెట్టనుందని, అలానే అందులో భాగంగా ఈనెల 18న ఈ మూవీ యొక్క రిలీజ్ ట్రైలర్ యూట్యూబ్ లో రిలీజ్ కానున్నట్లు టాక్.

ఇప్పటికే ఈ ట్రైలర్ కట్ కి సంబంధించి పనులు ప్రారంభించిన ఆర్ఆర్ఆర్ యూనిట్, తప్పకుండా ఈ ట్రైలర్ రిలీజ్ తరువాత మూవీ పై అందరిలో ఇప్పటివరకు ఉన్న అంచనాలు అమాంతంగా పెరగడం ఖాయం అని, అలానే రిలీజ్ తరువాత మూవీ తప్పకుండ పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయం అని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ ట్రైలర్ కి సంబంధించి త్వరలో అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుందట. మరి ఇదే కనుక నిజం అయితే ఆర్ఆర్ఆర్ కోసం ఎప్పటినుండో ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి ఇది మంచి పండుగ వార్తే. మరి ఈనెల 25న రిలీజ్ కానున్న ఆర్ఆర్ఆర్ మూవీ ఎంత మేర సక్సెస్ అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: