తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త ఇప్పుడు తెగ వైరల్  గా మారింది. అది ఏంటి అంటే బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో , బ్యూటిఫుల్‌ హీరోయిన్‌ సోనాక్షి సిన్హా సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారని. ఒక వార్త కాదు దానికి సంబంధించి వారిద్దరూ పెళ్లి చేసుకున్నట్టు ఒక ఫోటో కూడా సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది ఇక అది చూసిన వారి అభిమానులు షాక్ కి గురయ్యారు. అయితే వారి అభిమానులు అందరూ అంత పెద్ద హీరో ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడు ఏంటి అని ఆరా తీయగా దానికి సంబంధించిన కొన్ని విషయాలు బయటకు రావడం జరిగింది ఇక అవి ఏంటి అంటే..

కండల వీరుడు సల్మాన్‌ ఓ ఇంటివాడయ్యాడంటూ వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదట. అయితే సోనాక్షితో వివాహం అంటూ వస్తున్న న్యూస్ లో నిజం లేదు అని తెలిసింది. అంతేకాదు సల్మాన్ ఇంకా మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌గానే ఉన్నాడు అని తెలిసి ఫ్యాన్స్ కూల్ అయ్యారు. ఇకపోతే తమకు తెలియకుండా తమ అభిమాన స్టార్ పెళ్లి చేసుకోడు అంటూ పండగ చేసుకుంటున్నారు.కాగా  నెట్టింట్లో హల్ చల్ చేస్తున్న ఆ ఫొటో మార్ఫింగ్‌ ఫొటో అయ్యుంటుందని సినీవిశ్లేషకులు చెబుతున్నారు. ఇక ఈ విషయమై స్పందించింది సోనాక్షి. సోషల్ మీడియాలో  ఏది ఉంటే అది నమ్మేసే మూర్ఖులు కాదు ఆడియన్స్.

అంతేకాదు అసలు అది నిజమైన ఫోటోనేనా.. లేక మార్ఫింగ్ చేశారా అనేది తెలుసుకోలేనంత ఇదిలో లేరు జనాలు అంటూ కామెంట్ చేసింది సోనాక్షి. అయితే ఆ వైరల్ ఫోటోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సోనాక్షీ తనకు ఎటువంటి పెళ్లి జరగలేదు అని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది.ఇక ఇదిలా ఉంటె 2010 లో సల్మాన్‌ హీరోగా వచ్చిన దబాంగ్ సినిమాతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది ఈమె. అంతేకాదు సోనాక్షి దబాంగ్‌2 లో కూడా సల్మాన్ తో కలిసి నటించింది. ఇకపోతే ప్రస్తుతం కొన్ని వెబ్ సిరీస్ లు చేస్తోంది సోనాక్షీ. సల్మాణ్ ఖాన్ కబీ ఈద్‌ కబీ దివాళి సినిమాలో నటిస్తున్నారు. కాగా ఈ మూవీ ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో సెట్స్ పైకి వెళ్ళబోతోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: