ప్రపంచ సుందరి బాలీవుడ్ నుంచి హాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షలాది అభిమానులు ఆమె సొంతం. బాలీవుడ్ లో ఎన్నో సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ ఆ తరువాత హాలీవుడ్ కి వెళ్ళిపోయింది.హాలీవుడ్ సినిమాలు అలాగే సిరీస్ ల్లో  నటించడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా కూడా మంచి గుర్తింపును దక్కించుకుని పెద్ద గ్లోబల్ స్టార్ గా పేరు దక్కించుకోని నటిగా తనకంటూ ప్రత్యేక స్థానంను దక్కించుకున్న ప్రియాంక చోప్రాకు సోషల్ మీడియాలో టాప్ ఫాలోయింగ్ లిస్టులో చోటు దక్కింది. ఇక తన కంటే పది సంవత్సరాలు చిన్నవాడైన అమెరికన్ సింగర్ డిస్నీ స్టార్ నిక్ జోనాస్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న ప్రియాంక చోప్రా ఇటీవలే సరోగసి ద్వారా తల్లిగా మారిన తెల్సిందే..ప్రస్తుతం భర్త నిక్ జోనస్ ఇంకా తన బేబీ తో కలిసి అమెరికాలో ప్రత్యేకంగా నిర్మించుకున్న ఇంట్లో లైఫ్ ను బాగా ఎంజాయ్ చేస్తుంది.


ఇక అసలు విషయానికి వస్తే.. పెద్ద ఎత్తున ఆమె ను బాలీవుడ్ జనాలు ఇంకా ఆమె ఫ్యాన్స్ నెట్టింట ప్రశ్నలతో ముంచెత్తుతున్నారు.తల్లిగా మారిన ప్రియాంక చోప్రా ఇప్పటి దాకా ఎందుకు తన బేబీని చూపించలేదు అంటూ ప్రశ్నిస్తున్నారు. పైగా ఇప్పటి దాకా కూడా ప్రియాంక చోప్రా అధికారికంగా తనకు పాప పుట్టిందా బాబు పుట్టాడా అనే విషయాన్ని కూడా అసలు క్లారిటీ ఇవ్వలేదు. ఆమె కజిన్ ఇటీవల పాప అన్నట్లుగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడంతో ఆ విషయం రివీల్ అయ్యింది. దాన్ని కూడా ఆఫీషియల్ గా ప్రియాంక చోప్రా ప్రకటించలేదు.తాజాగా ఈమె సోషల్ మీడియాలో తన సోలో ఫోటోలను అలాగే వీడియోలను షేర్ చేస్తుండటంతో అభిమానులు నెట్టింట సహనం వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. తమకు జూనియర్ ప్రియాంక చోప్రాను ఎప్పుడు చూపించబోతున్నావు అంటూ అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇదే సమయంలో తండ్రి అయిన నిక్ ను కూడా ఎందుకు నువ్వు నీ ఫోటోల్లో చూపించడం లేదు అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. ఈమధ్య కాలంలో ప్రియాంక చోప్రా కాస్త బరువు పెరిగిందనే కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: