పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా ఒకదాని తరువాత మరొకటి సినిమాలు ఎంచుకుంటూ దూసుకెళ్తున్నారు. రెండున్నరేళ్ల క్రితం రిలీజ్ అయిన సాహో తరువాత త్వరలో రాధేశ్యామ్ మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్న ప్రభాస్, మరోవైపు ఇంకొక మూడు సినిమాలు కూడా చేస్తున్న విషయం తెలిసిందే. వాటిలో ప్రశాంత్ నీల్ తీస్తున్న సలార్ షూట్ వేగంగా సాగుతుండగా ఇందులో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. హోంబలె ఫిలిమ్స్ వారు ఎంతో భారీ వ్యయంతో పాన ఇండియా రేంజ్ లో నిర్మిస్తున్న సలార్ మూవీ వచ్చే ఏడాది రిలీజ్ కానున్నట్లు టాక్.

ఇక ఓం రౌత్ తో ప్రభాస్ చేస్తున్న భారీ మూవీ ఆదిపురుష్. కృతి సనన్ కథానాయికగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇతిహాస గాథ రామాయణం ఆధారంగా రూపొందుతోంది. టి సిరీస్ అధినేత భూషణ్ కుమార్ నిర్మిస్తున్న ఆదిపురుష్ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది. అలానే వైజయంతి మూవీస్ బ్యానర్ పై నాగ అశ్విన్ తీస్తున్న సైన్స్ ఫిక్షన్ సినిమా ప్రాజెక్ట్ కె లో కూడా యాక్ట్ చేస్తున్నారు ప్రభాస్. ఈ సినిమా కూడా ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే అసలు విషయం ఏమిటంటే, వీటితో పాటు ఇటీవల మరొక సినిమాకి కూడా ప్రభాస్ పచ్చ జండా ఊపినట్లు తెలుస్తోంది. యువ దర్శకుడు మారుతీ దర్శకత్వంలో ప్రభాస్, రాజా డీలక్స్ అనే సినిమా చేస్తున్నారని ప్రముఖ నిర్మాత దానయ్య ఈ మూవీని ఎంతో గ్రాండ్ గా నిర్మించనున్నారని ఇటీవల కొద్దిరోజులుగా మీడియా మాధ్యమాల్లో కథనాలు వస్తున్నాయి.

మరోవైపు ఈ సినిమా పక్కాగా సెట్ అయిన మాట వాస్తవమేనేని, ప్రస్తుతం మారుతీ ఈ మూవీ పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేస్తుండగా దీనిని ఏప్రిల్ 10న అధికారికంగా అనౌన్స్ చేయనున్నారని సమాచారం. అయితే ఈ సినిమాకి సంబంధించి నేడు ప్రచారం అవుతున్న మరొక వార్త ప్రకారం, ఈ మూవీ యొక్క టైటిల్ ని మార్చనున్నట్లు చెప్తున్నారు. మారుతీ సిద్ధం చేసుకున్న రాజా డీలక్స్ టైటిల్ లీక్ కావడంతో పాటు టైటిల్ ప్రభాస్ ఫ్యాన్స్ కి పెద్దగా నచ్చకపోవడంతో దానిని మార్చే ఆలోచన కూడా చేస్తున్నారట. అన్ని అనుకున్నట్లు జరిగితే ఏప్రిల్ 10న ఈ మూవీ అనౌన్స్ మెంట్ రోజునే సినిమా కొత్త టైటిల్ కూడా ప్రకటించనున్నట్లు టాక్. మరి ఇదే కనుక నిజం అయితే ప్రభాస్ ఫ్యాన్స్ కి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: