సినిమాల్లో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారి వారసులు  చిత్ర పరిశ్రమలోకి  రావడం ఇక ఆ తర్వాత వాళ్లే బాగా రాణించడం జరుగుతూ ఉంది. మరీ ముఖ్యంగా ఇండస్ట్రీలో అయితే వారసత్వం  అనేది మరీ ఎక్కువైపోయింది.. బాలీవుడ్ టాలీవుడ్ కోలీవుడ్ అనే తేడా లేదు.. అన్నీ ఇండస్ట్రీలో కూడా హీరో హీరోయిన్ల వారసులు   ఎంట్రీ ఇస్తూ  రాణిస్తున్నారు. ఇక చాలా మంది స్టార్ నటీనటులు వారి పిల్లలను వెండితెరకు పరిచయం చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఇలా వారి బ్యాక్ గ్రౌండ్ తో వచ్చిన వారు చాలామంది బాగానే రాణిస్తున్నారు.



 ఇక బాలీవుడ్ లో కేవలం హీరోలు  మాత్రమే కాదు హీరోయిన్లు సైతం ఇలా స్టార్ కిడ్ గా  చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నారు అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్ వారసత్వాన్ని అనుసరించే ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అయితే బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ కూడా మరికొన్ని రోజుల్లో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతోంది అంటూ టాక్ మొదలైంది. దీంతో అభిమానులు కూడా ఐరా ఖాన్ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందా అని ఆసక్తిగా ఎదురు చూశారు.


 కానీ తాను మాత్రం  ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వడానికి పూర్తిగా వ్యతిరేకం అంటుంది ఐరా ఖాన్. దీంతో అభిమానులు షాక్ అవుతున్నారు. తండ్రి వారసత్వాన్ని అనుసరించి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వటంపై ఐరా ఖాన్ స్పందించింది. ఇంస్టాగ్రామ్ లో తనదైన శైలిలో ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇటీవల నెటిజన్లు  అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెబుతూ వచ్చింది. ఇందులో భాగంగా బాలీవుడ్ లో నటిగా మారాలని అన్న ఆలోచన ఉందా అంటూ అడుగగా నేను సినిమాల్లోకి రావడం లేదు అంటూ సమాధానం చెప్పిందట. అయితే గతంలో మీడియా అనే నాటకానికి దర్శకత్వం వహించింది ఈ అమ్మడు. దీంతో నటిగా కాకుండా దర్శకురాలిగా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది అని అభిమానులు అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: