ఈ మధ్యకాలంలో ప్రేక్షకులను అలరించిన ముద్దుగుమ్మల విషయానికి వస్తే తమ అందచందాలతో అందరినీ అలరించిన హీరోయిన్లు ఇద్దరు తప్పకుండా గుర్తుకు వస్తారు. వారే కిలాడి సినిమా లో అందాల కనువిందు చేసిన మీనాక్షి చౌదరి మరియు డింపుల్ హయాతి. ఎలాంటి ఆర్భాటాలకు పోకుండా ఆ చిత్రంలో వీరు చేసిన సందడి అంతా ఇంతా కాదు. దీనికి ముందు వీరిద్దరు కూడా చెప్పుకోదగ్గ సినిమాలు చేయలేదు. అయినా కూడా వారిని మాత్రమే చూడడానికి కొంత మంది ప్రేక్షకులు ఈ సినిమా కు వచ్చారు.

అంటే వారు ఏ స్థాయిలో అందరినీ ఆకట్టుకున్నారో అర్థం చేసుకోవచ్చు. మీనాక్షి చౌదరి మాత్రం ఓ మంచి సినిమాల్లో నటించినప్పటికీ క్రేజ్ మాత్రం రాలేదు. డింపుల్ విషయానికి వస్తే ఆమె కూడా పెద్ద సినిమా లో ఓ స్పెషల్ సాంగ్ చేసిన కానీ జనాలకు పెద్దగా తెలియరాలేదు. ఈ నేపథ్యంలో వీరిద్దరు కూడా కిలాడి సినిమాలో నటించే ఛాన్సులు కొట్టేసి క్రేజీ హీరోయిన్ గా మారిపోవాలని భావించారు. కానీ ఆ సినిమా ఫ్లాప్ అవడంతో ఆ కోరిక నెరవేరలేదు. అయినా కూడా వీరిద్దరికీ మంచి పేరే వచ్చింది. అయితే ఇండస్ట్రీలో హిట్ అనేది అందరికీ దారి చూపిస్తుంది.

కాబట్టి ఈ హీరోయిన్ లు ఎంతగా అందాలు ఆరబోసిన కూడా హిట్ అనే అదృష్టం లేకపోవడంతో వారు స్టార్స్ కాలేకపోయారు. ఆ విధంగా వీరిద్దరికీ ఈ సినిమా హిట్ తెస్తుంది ప్లస్ అవుతుంది అనుకుంటే మైనస్ అయ్యింది. హిట్ తో పాటు వచ్చే క్రేజ్ వారికి మరిన్ని అవకాశాలను తీసుకువస్తుంది. అలా కాకుండా క్రేజ్ మాత్రమే వచ్చి అపజయం వచ్చేసరికి చాలా మంది దర్శక నిర్మాతలు వీరిని హీరోయిన్ గా తీసుకోవడానికి వెనకాడుతున్నారు.  ఇప్పటికీ వారి కెరియర్ కు వచ్చిన ప్రమాదం ఏది లేదు. వీరిద్దరి చేతిలోనూ కూడా ఇప్పుడు మంచి సినిమాలే ఉన్నాయి. మరి ఈ అవకాశాలు వారిని స్టార్ హీరోయిన్స్ గా మారుస్తాయా అనేది చూడాలి. మీనాక్షి హిట్ 2 సినిమా చేస్తుంటే, డింపుల్ గోపీచంద్ సినిమా లో హీరోయిన్ గా చేస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: