టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన సమంత విడాకుల ప్రకటన తర్వాత కెరీర్ విషయంలో వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నారనే విషయం తెలిసిందే. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు సమంత ఎక్కువ సంఖ్యలో యాడ్స్ లో కూడా నటిస్తున్నారు.

ఈ ఏడాది కొన్ని నెలల గ్యాప్ లోనే సమంత నటించిన రెండు సినిమాలు థియేటర్లలో విడుదల కానున్నాయని జోరుగా తెగ ప్రచారం జరుగుతోంది. విడాకుల ప్రకటన తర్వాత చైతన్య పేరును ఎత్తడానికి కూడా సమంత అస్సలు ఇష్టపడటం లేదు.

సోషల్ మీడియాలో చాలా సందర్భాల్లో తాను బాధలో ఉన్నట్టు సమంత పరోక్షంగా వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే సమంత గురించి తాజాగా సోషల్ మీడియాలో కొత్త ప్రచారం మొదలైంది. అక్కినేని ఫ్యామిలీకి కొన్ని వస్తువులను సమంత తిరిగిచ్చేసిందని వైరల్ అవుతుంది.. చైతన్య సమంత మళ్లీ కలుస్తారేమో అని ఫ్యాన్స్ భావించినా కానీ వీళ్లిద్దరూ కలవడం కష్టమేనని తెలుస్తోంది.

  అయితే విడిపోయినప్పటికీ చైతన్యకు సంబంధించిన వస్తువులు, పెళ్లికి సంబంధించిన వస్తువులు కొన్ని సమంత దగ్గర ఉండగా తాజాగా సమంత ఆ వస్తువులను కూడా వెనక్కు ఇచ్చేశారని సమాచారం అందుతోందట.. పెళ్లి చీరను, ఖరీదైన కొన్ని వస్తువులను సమంత చైతన్య దగ్గరకు పంపించారని సమాచారం.. సమంత నటించిన శాకుంతలం భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. ఈ సినిమాతో పాటు సమంత యశోద అనే సినిమాలో కూడా నటిస్తున్నారు.

  సమంత నటించిన కాతువాక్కుల రెండు కాదల్ ఏప్రిల్ 28వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. సమంత పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఈ సినిమాను విడుదల చేస్తుండటం విశేషం.సినిమాసినిమాకు సమంతకు అంతకంతకూ క్రేజ్ పెరుగుతోంది. సమంతను అభిమానించే అభిమానులు కోట్ల సంఖ్యలో ఉన్నారట.. కథ నచ్చితే మాత్రమే సమంత కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇస్తున్నారు.మరి బోల్డ్ గా వుండే పాత్రలను తన కెరీర్ కు ఉపయోగం ఉంటేనే ఒప్పుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: