ఇటీవలి కాలం లో చిత్ర పరిశ్రమ లో విషాదకర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమం లోనే  ఎంతో మంది ప్రేక్షకులు అభిమానులు కూడా తీవ్రంగా దిగ్భ్రాంతిలో మునిగి పోతున్న ఘటనలు వెలుగు లోకి వస్తున్నాయి. ఇలా చిత్ర పరిశ్రమలో ఎన్నో ఏళ్ల పాటు సేవలందించి ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటీనటులు గాయకులు సైతం చిత్ర పరిశ్రమను వదిలి వెళ్ళి పోతున్నారు. ఇటీవల టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక విషాదకర ఘటన చోటు చేసుకుంది.


 పాత తరం సినీ నటుడు రంగస్థల కళాకారుడు వైవిధ్యమైన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న గొప్ప వ్యక్తి  వెంకటేశ్వరరావు కన్ను మూశారు. గత కొంత కాలం నుంచి అనారోగ్యం తో బాధపడుతున్న పి వెంకటేశ్వరరావు ఇటీవలే కోటి లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఇక వెంకటేశ్వర రావు మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియ జేయడం గమనార్హం. కాగా వెంకటేశ్వరరావుకు భార్య లక్ష్మి ఐదుగురు ఆడపిల్లలు ఇద్దరు మగపిల్లలు సంతానం ఉండటం గమనార్హం. ఇక ప్రస్తుతం ఆయన వయస్సు 90 సంవత్సరాలు.


 వెంకటేశ్వరరావు రంగస్థల నటుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాల్లో నటించి ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు. ఈయన పూర్తి పేరు పిసుపాటి వెంకటేశ్వర్ రావు. ఇదేమిటి అనే నాటకంలో ఆంధ్ర నాటక కళా పరిషత్తు వారిచే ఉత్తమ కమెడియన్ అవార్డు కూడా అందుకున్నారు. ఒక మురారి నాటకంలో నటనకు గాను ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నారు ఆయన. ఒక తేనె మనసులు చిత్రం తో హాస్యనటుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఆయన ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక ఎన్నో సినిమాల్లో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు వెంకటేశ్వరరావు.

మరింత సమాచారం తెలుసుకోండి: