ఉప్పెన' సినిమా ఇలా విడుదలైందో లేదో కానీ దర్శకుడు బుచ్చిబాబు సానాకి మంచి పేరు అయితే వచ్చేసింది. అంతేకాదు ఆ తర్వాత సినిమా ఇదేనంటూ కొన్ని పుకార్లు కూడా ఎన్నో వచ్చేశాయి.

అయితే ఏమైందో ఏమో కానీ ఒక్క పుకారు కూడా అస్సలు నిజం కాలేదు. అయితే అలా వచ్చిన పుకార్లలో 'ఎన్టీఆర్‌తో సినిమా' అనే పుకారు చాలా గట్టిగా అయితే వినిపించింది. అందుకేనేమో ఇన్ని రోజుల బుచ్చిబాబు నిరీక్షణకు అయితే ఫుల్‌స్టాప్‌ పడింది. అవును ఎన్టీఆర్‌ - బుచ్చిబాబు సానా సినిమా పక్కా అని అందరూ అంటున్నారు. గతంలో వినిపించిన పుకార్లే పక్కాగా కరెక్ట్‌ అని కూడా సమాచారం.

 


ఎన్టీఆర్‌ ఆ మధ్య ఇంటర్నేషనల్‌ మీడియాతో మాట్లాడినప్పుడు బుచ్చిబాబు సనా సినిమా గురించి అస్సలు ప్రస్తావించలేదు. దీంతో ఆ సినిమా ఇక లేనట్లే అనుకున్నారు అంతా . అయితే అభిమానుల మనసులో ఎక్కడో చిన్న బాధ ఉందట.కారణం బుచ్చిబాబు చెప్పారు అంటున్న కథ, నేపథ్యం ఎంతో బాగుండటమే. స్పోర్ట్స్‌ నేపథ్యంలో ఆ సినిమా ఉంటుందని పుకార్లు కూడా వచ్చాయి. దీంతో తమ అభిమాన నటుడిని స్పోర్ట్స్‌ స్టార్‌గా చూడాలనుకున్నారట ఫ్యాన్స్‌. అయితే వారు మనసులో గట్టిగా కోరుకున్నట్లున్నారనుకుంటా.

 

బుచ్చిబాబు సినిమాలో తారక్‌ 'ఛాంపియన్‌'గా కనిపిస్తాడని తెలుస్తుంది.మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌లోనే ఈ సినిమా ఉంటుందని పక్కాగా చెబుతున్నాయట టాలీవుడ్‌ వర్గాలు. అంతేకాదు వచ్చే నెల 11న ఈ సినిమాకు సంబంధించి ప్రకటన కూడా వచ్చేస్తుంది అని లెక్కలు కూడా వేస్తున్నారు.. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఈ సినిమాలో ఎన్టీఆర్‌ కబడ్డీ ఛాంపియన్‌గా కనిపించనున్నాడని తెలుస్తుంది.అంతేకాదు కోచ్‌గానూ ఆయన తెరపై సందడి చేయనున్నాడని వార్త వినిపిస్తుంది.. 'పెద్ది' అనే వర్కింగ్‌ టైటిల్‌తో షురూ కానున్న ఈ సినిమా కోసం ఎన్టీఆర్‌ ప్రత్యేకంగా సన్నద్ధం కానున్నట్టు సమాచారం.

 

అయితే ఈ విషయాలపై చిత్రబృందం అయితే అధికారికంగా స్పందించాల్సి ఉంది. అయితే ఇక్కడే ఒక డౌట్‌ ఉందని తెలుస్తుంది.బుచ్చిబాబు సనా సినిమా ఇప్పుడు అనౌన్స్‌ చేస్తున్నారంటున్నారు కదా మరి కొరటాల శివ సినిమా ఏమైనట్లు అబ్బా అని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.సెట్స్‌ రెడీ, త్వరలో ప్రారంభం అని ఆ మధ్య కొరటాల శివ చెప్పిన సంగతి కూడా తెలిసిందే. మరెందుకు ఆలస్యం జరుగుతుందో తెలీదు...

మరింత సమాచారం తెలుసుకోండి: