హ్యాపీడేస్ చిత్రం ద్వారా తెలుగు చలన చిత్ర పరిశ్రమకు వచ్చి అంచెలంచెలుగా ఎదిగి స్టార్ హీరోయిన్ గా మారింది తమన్నా. ఆమె ఇండస్ట్రీకి వచ్చి రెండు దశాబ్దాలు కావస్తున్నా కూడా ఇప్పటికీ వన్నె తరగని అందంతో మంచి నటనతో ప్రేక్షకులను మరియు తన అభిమానులను అలరిస్తుంది. ఆ విధంగా తమన్నా ఇప్పుడు సినిమా పరిశ్రమలో కొనసాగడం ఆమె అభిమానులకు ఎంతగానో కిక్కు ఇస్తుంది. ఆమె తోటి హీరోయిన్ లందరూ కూడా ఫేడ్ అవుట్ అయిపోయిన నేపథ్యంలో ఈమె ఇంకా ప్రేక్షకులను అలరించే విధంగా సినిమాలు చేయడం విశేషం. 

ఎప్పుడైతే ఆమె హీరోయిన్ గా మాత్రమే చేయాలనే ఆశలి పెట్టుకోకుండా అన్ని రకాల పాత్రలను స్పెషల్ సాంగులు కూడా చేయడం మొదలు పెట్టిందో అప్పటి నుంచి ఆమెకు మరిన్ని అవకాశాలు వస్తున్నాయి అని చెప్పవచ్చ. మారుతున్న ట్రెండ్ ప్రకారం ఆమె తనను తాను మార్చుకోవడం అలాగే తనను తాను తీర్చిదిద్దుకుని ప్రేక్షకులను అలరించే విధంగా చేసుకోవడం వంటివి జరిగింది. అందుకే ఆమె ఇప్పటికీ హీరోయిన్ గా కొన్ని సినిమాల్లో నటిస్తుందని చెప్పవచ్చు.

ఇకపోతే ఈమె ఇప్పుడు కూడా టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఆమె ముఖ్య కథానాయికగా కొన్ని వెబ్ సిరీస్ లు ఇప్పటికీ నిర్మితం కాగా ఇంకా కొన్ని వెబ్ సిరిస్ లు నిర్మితం కాబోతున్నాయి. అలా తమన్నా ఎలాంటి అవకాశం వచ్చినా నో చెప్పకుండా సినిమాలను చేస్తూ వాటి ద్వారా మంచి సక్సెస్ ను ప్రేక్షకులు భారీ పాపులారిటీని అందుకుంటుంది. ప్రస్తుతం ఆమె చేస్తున్న తెలుగు సినిమాలను పరిశీలిస్తే మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న భోళా శంకర్ చిత్రంలో నటిస్తుంది. అంతేకాదు యువహీరో సత్యదేవ్ తో కలిసి ప్రేమకథ సినిమాలో కూడా నటిస్తుంది. మరి ఈ రెండు సినిమాలు కూడా ప్రేక్షకులను మెప్పించి హిట్ కొడితే మాత్రం ఆమె హీరోయిన్ టాలీవుడ్ లో హవా చూపించే అవకాశం ఉందని చెప్పొచు. 

మరింత సమాచారం తెలుసుకోండి: