టాలీవుడ్ హాట్ హీరోయిన్ తమన్నా భాటియా తాజాగా ప్రముఖ పాప్ గాయకుడు బాద్షా కొత్త పాటలో మెరుపులు మెరిపించింది. సాంగ్ ఇంతకుముందే విడుదల కాగా..ఇందులో తమన్నా హాట్ అందాలతో షేక్ చేస్తూ ఇంటర్నెట్ లో తబాహిని సృష్టించింది. ఇక ఈ పాట యూ ట్యూబ్ లో విడుదలైన నాలుగు గంటల్లోనే పాట 358000 వీక్షణలను పొందింది ఇప్పటికీ కూడా దూసుకుపోతుంది.బాద్షా 'తబాహి'లో తమన్నా భాటియా మైండ్ బ్లోవింగ్ డ్యాన్స్ ఇంటర్నెట్ లో తుఫాను సృష్టించింది. తబాహి పాటకి తమన్నా బోలెడంత ప్రచారం చేస్తోంది. తబాహి సాంగ్ గురించి తమన్నా మాట్లాడుతూ "నేను బాద్షాతో కలిసి పని చేయడం ఇదే ఫస్ట్ టైం. అతనితో వీడియో మేకింగ్ అనేది బ్లాస్ట్! నేను ఈ పాటను ఫస్ట్ టైం విన్నప్పటి నుండి నేను రహస్యంగా నాలో నేనే హమ్ చేస్తున్నాను. ఇప్పుడు చివరకు నేను దానిని పెద్దగా పాడగలను!" అంటూ ఉబ్బితబ్బిబ్బయ్యింది.

ఇక ఇదంతా పక్కన పెడితే ఈ ఆల్బమ్ ప్రచారంలో భాగంగా తాజా ఫోటోషూట్ తో తమన్నా మైండ్ బ్లాక్ చేసిందనే చెప్పాలి. వంగ పువ్వు రంగు టాప్ ఇంకా డార్క్ షేడెడ్ ఫ్యాంటుతో తమన్నా స్టైలింగ్ సంథింగ్ హాట్ గా యూనిక్ గా కనిపిస్తూ యూత్ కి పిచ్చెక్కిస్తుంది. ఇక అలా వీడియోగ్రాఫర్లు ఫోటోగ్రాఫర్ల ముందు మిల్కీ బ్యూటీ హొయలు పోయిన తీరు అయితే యూత్ మతులు చెడగొడుతోంది. ప్రస్తుతం తమన్నా హాట్ పిక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.ఇక ఈ ప్రయత్నం చూస్తుంటే ఇకపై తాను కూడా పాన్ ఇండియా స్టార్ గా వెలిగిపోవాలని కలలుగంటోంది అంటూ రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి.కాని పాపం ఇన్ని రకాలుగా ఎక్స్ పోసింగ్ చేస్తూ ఎంత ట్రై చేసినా కాని తమన్నాకు తెలుగులో మాత్రం ఆఫర్స్ అసలు రావట్లేదు. పాపం స్టార్ స్టేటస్ చూసిన తమన్నా ఇప్పుడు ఐటమ్ సాంగ్స్ కే పరిమితం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: