మెగాస్టార్ చిరంజీవి ఎన్నో హిట్,  సూపర్ హిట్,  బ్లాక్ బస్టర్ మూవీ లతో టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నాడు, రాజకీయాల వల్ల కొంత కాలం పాటు సినిమాలకు దూరం అయిన మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలలో నటిస్తూ వస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి తన కెరియర్ లో ఇప్పటి వరకు ఎంతో మంది హీరోయిన్ లతో ఆడి పాడాడు,  అలాగే ముగ్గురు అక్క చెల్లెల తో కూడా కలిసి  నటించాడు,   చిరంజీవి నటించిన ముగ్గురు అక్క చెల్లెలు ఎవరో తెలుసుకుందాం...

నగ్మా : చిరంజీవి ,  నగ్మా కాంబినేషన్ లో ఘరానా మొగుడు,  రిక్షావోడు , ముగ్గురు మొనగాళ్ళు లాంటి సినిమాలు తెరకెక్కాయి,  ఈ సినిమాలో ఘరానా మొగుడు సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించడం మాత్రమే కాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎన్నో కొత్త రికార్డులను సృష్టించింది,  చిరంజీవి నగ్మా కలిసి చాలా సినిమాల్లో కలిసి నటించారు.

రోషిణి : నగ్మా చెల్లెలు రోషిణి ఈ ముద్దుగుమ్మ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎక్కువ సినిమాలలో నటించకపోయినప్పటికీ మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన మాస్టర్ సినిమాలో చిరంజీవి తో కలిసి ఆడిపాడింది,  ఈ సినిమా మంచి విజయం సాధించడంతో టాలీవుడ్ ఇండస్ట్రీ లో రోషిణి కి మంచి గుర్తింపు లభించింది.

జ్యోతిక : నగ్మా చెల్లెలు జ్యోతిక,  మెగాస్టార్ చిరంజీవి హీరోగా వివి వినాయక్ దర్శకత్వం లో తెరకెక్కిన ఠాగూర్ మూవీ లో  హీరోయిన్ గా నటించింది,  ఈ సినిమా కూడా అదిరిపోయే బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించడం మాత్రమే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీ లో కొత్త రికార్డులను సృష్టించింది, అలాగే ఠాగూర్ సినిమా జ్యోతిక కు కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు ను తీసుకొచ్చింది.

ఇలా మెగాస్టార్ చిరంజీవి ముగ్గురు అక్క చెల్లెల్లు అయిన నగ్మా, రోషిణి, జ్యోతిక లతో  కలిసి సినిమాల్లో ఆడిపాడారు.

మరింత సమాచారం తెలుసుకోండి: