ప్రేక్షకులకు నచ్చే సినిమాలు చేస్తే హీరో ఎంతతోడు అయినా కూడా సదరు సినిమాను అభిమానులు ఆదరిస్తారు. అలా మహేష్ బాబు తనకే సొంతమైన నటనతో ప్రేక్షకులను అలరించే సినిమాలు చేసి ఇప్పుడు టాలీవుడ్ సూపర్ స్టార్ గా ఎదిగాడు.  మొదటి నుంచి కూడా రీమేక్ సినిమాలు చేయడం ఆయనకు పెద్దగా ఇష్టం ఉండదు. రీమేక్ ల వలన హీరో కు డిమాండ్ వుండదు అనే అభిప్రాయం ఆయనది. తన సినిమాకు ఎంత బడ్జెట్ అవుతుంది ఎంత హిట్ అవుతుంది అనే విషయాల్లో ఎంతో క్లారిటీగా ఉంటాడు మహేష్.

ఆ విధంగా తన సినిమాల విషయంలో ఎంతో క్లారిటీ గా వ్యవహరిస్తూ ఇప్పుడు ఇంతటి స్థాయికి ఎదిగాడు. ఇటీవల కాలంలో ఆయన వరుసగా ప్రేక్షకులను భారీ స్థాయిలో అలరించే సినిమాలను చేస్తున్నాడు. అయితే ఆయన చేసిన కొన్ని సినిమాలు గతంలో వేరే హీరోలు చేసిన కొన్ని సినిమాలను పోలి ఉండటం జరుగుతుంది. ఇది అనుకోని చేశారో లేదా అనుకోకుండా చేశారో కానీ వాటిని అటు ఇటుగా మార్పులు చేసి సినిమాలుగా చేయడం జరిగింది అనేది వాస్తవం. ఏదైతేనేమి సూపర్ స్టార్ అభిమానులను మాత్రం ఈ చిత్రాలు విపరీతంగా అలరించాయి.

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన శ్రీమంతుడు సినిమా కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన జననీ జన్మభూమి అనే సినిమాను గుర్తుకు తెస్తుంది. అప్పట్లో ఈ సినిమా పెద్దగా ఆదరణ పొందలేదు కానీ మహేష్ బాబు ఇప్పటి తరానికి అర్థమయ్యే విధంగా కమర్షియల్ హంగులు జోడించేసి విడుదల చేయడంతో ఈ సినిమా ఇంత పెద్ద సూపర్ హిట్ అయ్యింది. ఇక మహేష్ బాబు కెరీర్ లో  స్పెషల్ గా చెప్పుకోవాల్సిన సినిమా అతడు. ఈ సినిమా గతంలో వెంకటేష్ హీరోగా చేసిన వారసుడొచ్చాడు సినిమా కథను పోలి ఉంటుంది. అంతేకాదు మహేష్ కెరీర్ లో భారీ బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచిన పోకిరి సినిమా కూడా చిరంజీవి నటించిన స్టేట్ రౌడీ సినిమా కు చాలా దగ్గరగా కనిపిస్తూ ఉంటుంది. అలా పాతతరం హీరోలు చేసిన సినిమా కథలలో మార్పులు చేసి మహేష్ ఎలాంటి డౌట్ రాకుండా ఆ సినిమాలను చేసి ఘన విజయాలు అందుకొన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: